దివాలీ గ్రేట్ ఇండియా సేల్ ! ఈ పండుగకు కొనాల్సిన పాతిక స్టాక్స్ ఇవే..!

దివాలీ గ్రేట్ ఇండియా సేల్ ! ఈ పండుగకు కొనాల్సిన పాతిక స్టాక్స్ ఇవే..!

సాధారణంగా పండుగ సీజన్‌లో డిస్కౌంట్ షాపింగ్ ఎక్కువగా నడుస్తుంది. కస్టమర్లు కూడా ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువగా దొరుకుతుందో ఆరా తీస్తారు. మరి స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా ఈ దీపావళికి దలాల్ స్టీట్‌లో తక్కువ ధరకే స్టాక్స్ దొరుకుతున్నాయి. మరి మీరు కూడా ది గ్రేట్ ఇండియన్ డిస్కౌంట్ షాపింగ్ చేసేయండి. ఇదే విషయం ప్రముఖ స్టాక్ ఎనలిస్టులు కూడా చెబుతున్నారు. ఇప్పుడున్న మార్కెట్లలో చాలా కంపెనీల షేర్లు పతనం అయ్యాయి. అంటే తక్కువ ధరకే మనకు రానున్న కొద్ది నెలల్లో లాభాలు తెచ్చిపెట్టనున్న షేర్లు దొరుకుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. జనవరి వరకూ ఈ మార్కెట్ కరెక్షన్స్ ఉండవచ్చని ఆ తరువాత స్టాక్స్ లాభాల బాట పట్టొచ్చని వారు భావిస్తున్నారు.  దలాల్ స్ట్రీట్‌లో ఈ పండుగకు కొంత మేర షాపింగ్ (స్టాక్‌ పికింగ్ ) చేయని ప్రముఖ మార్కెట్ ఎక్స్‌పర్ట్ , MD & CEO యాక్సిస్‌ సెక్యూరిటీస్ అరుణ్ తుక్రాల్ సూచిస్తున్నారు.  ఈ అక్టోబర్ మాసాంతానికి ఇయర్ టు డేట్ ప్రాతిపదికన BSE ఇండెక్స్ 9శాతం పడిపోయింది. BSE మిడ్‌ క్యాప్, స్మాల్ క్యాప్ రంగాలు 20-28 శాతం నష్టపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి స్టాక్స్ ను ఎంపిక చేసుకునే తరుణం ఆసన్నమైందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న కొద్ది నెలల కోసం కొన్ని స్టాక్స్ ప్రభావంతమైన ఫలితాలను వెల్లడించనున్నాయని ఇన్వెస్కో ఈక్విటీస్ CIO తాహెర్ బాద్‌షా అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్బీఐ తీసుకోబోయే చర్యలు కూడా మార్కెట్లకు ఉపశమనం కలిగించనున్నాయని, త్వరలోనే మార్కెట్లు బౌన్స్ బ్యాక్ తీసుకుంటాయని తాహెర్ బాద్‌షా  పేర్కొన్నారు.
కంపెనీ ప్రైస్‌ టు ఎర్నింగ్స్ (PE)ను పరిశీలించండి
ఈ అక్టోబర్ మాసాంతానికి BSE 500 స్టాక్స్‌లో దాదాపు 282 స్టాక్స్ ఇండస్ట్రీ PE రేషియోకి దిగువన ట్రేడ్ అయ్యాయి. లాంగ్ టర్మ్‌ ప్రాతిపదికన వీటిలో కొన్ని స్టాక్స్ మంచి ఫలితాలను వెల్లడించవచ్చని మార్కెట్ ఎనలిస్టులు సూచిస్తున్నారు. BSE 500 ఇండెక్స్ లోని బాటా ఇండియా, మహీంద్రా హాలిడేస్, VA టెక్ , జస్ట్ డయల్, అజంతా ఫార్మా, నాట్‌కో ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా, కాల్గేట్ పామోలివ్ , ఆశోక్ లేల్యాండ్, DCM, శ్రీరామ్ ఫిన్, DHFL , రాలీస్ ఇండియా, వంటి ప్రముఖ స్టాక్స్ కంపెనీ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇండస్ట్రీ సగటు కంటే దిగువకు పడిపోయాయి.
మరి ఈ దీపావళికి ఎలాంటి స్టాక్స్ ను ఎంచుకోవాలో ప్రముఖ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థలు కొన్ని సూచనలను ఇస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.


యాక్సిస్‌ సెక్యూరిటీస్ సూచిస్తున్న కంపెనీలు
అశోక్ లేల్యాండ్, బజాజ్‌ ఫైనాన్స్, HUL , ICICI బ్యాంక్, L&T ఇన్ఫోటెక్, మిండా ఇండస్ట్రీస్‌, మోల్డ్ టెక్ ప్యాకేజింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టీల్ స్ట్రిప్‌ వీల్స్, టైటాన్, ట్రైడెంట్.


HDFC సెక్యూరిటీస్ సూచిస్తున్న స్టాక్స్ ..
ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్, పరాగ్ మిల్క్ , కుమిన్స్ , అపోలో హాస్పిటల్స్, ఎక్సైడ్ , సన్ ఫార్మా, సియెంట్, ICICI బ్యాంక్, డాక్టర్‌ రెడ్డీస్, హిందూస్థాన్ ఆయిల్ . ( ఒక సంవత్సరం కాలం కోసం )


రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ సూచిస్తున్న స్టాక్స్
అశోక్ లేల్యాండ్, ఏషియన్ పేయింట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, కుమ్మిన్స్ ఇండియా, గోద్రేజ్‌ కన్జూమర్ ప్రోడక్ట్స్, మారుతీ సుజుకీ ఇండియా, వోల్టాస్ .

 Most Popular