సెక్షన్‌ 7..?

సెక్షన్‌ 7..?
  • దేశ చరిత్రలో తొలిసారి కేంద్రం సంచలన నిర్ణయం
  • ఆర్‌బీఐపై సెక్షన్‌ 7ను ప్రయోగించిన కేంద్రం?
  • ఈ సెక్షన్‌ అమలైతే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆర్‌బీఐ నడుచుకోవాల్సిందే..
  • NPAల వర్గీకరణ, విద్యుత్‌ కంపెనీలకు నిబంధనల సరళీకరణలోనూ ఆర్‌బీఐకి, ప్రభుత్వానికి మధ్య కుదరని ఏకాభిప్రాయం
  • సెక్షన్‌ 7 సంగతే ప్రస్తావించకుండా ఆర్‌బీఐకి స్వయం ప్రతిపత్తి తప్పనిసరి అంటూ ప్రజా ప్రయోజనాలూ కూడా ముఖ్యమని తెలిపిన ప్రభుత్వం
  • సెక్షన్‌ 7 కింద ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించకుండానే ఈ వ్యాఖ్యలు చేసిన ఆర్థికశాఖ
  • ఆర్‌బీఐపై ప్రభుత్వం సెక్షన్‌ 7ను ప్రయోగించిందా లేదా అన్నది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది
  • ఆర్‌బీఐపై ఎపుడూ ఉపయోగించని సెక్షన్‌పై మాట్లాడడానికి ఆర్థిక మంత్రి జైట్లీ నిరాకరణ
  • ఆర్‌బీఐకి, ప్రభుత్వానికి మధ్య జరిగే చర్చలను ఎపుడూ బయటకు వెల్లడించలేదన్న అరుణ్‌ జైట్లీ
  • ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తికి ఇక కాలం చెల్లినట్లేనని విపక్షాల ఆగ్రహం


Most Popular