దీపావళి నెలలో మార్కెట్లు ఎంత పెరుగుతాయి..! చరిత్ర ఏం చెబ్తోంది ?

దీపావళి నెలలో మార్కెట్లు ఎంత పెరుగుతాయి..! చరిత్ర ఏం చెబ్తోంది ?

ఇప్పటికే స్టాక్ మార్కెట్లు  ఒడుదిడుకుల్లో ఊగిసలాడుతున్నాయి. మరి ఈ దివాలీ నెల (నవంబర్ ) ఎలా ఉండబోతుంది. మదుపర్ల ఇళ్ళల్లో దీపావళి కాంతులు వెదజల్లేనా? అందులోనూ ఈ దీపావళి నెలలోనే బోంబే స్టాక్ ఎక్సేంజ్‌లో సంవత్‌ (కొత్త సంవత్సరం ) వేడుకలు కూడా దివాలీ పర్వదినాన జరగనున్నాయి. మూరత్ ట్రేడింగ్‌ను సెంటిమెంట్‌గా భావిస్తారు దేశీ ఇన్వెస్టర్లు. మరి ఈ పండుగ మాసంలో మార్కెట్లు ఎలా ఉంటాయి. మదుపర్ల ఆశలను అందలమెక్కిస్తాయా? ఆవిరి చేస్తాయా? గత చరిత్ర ఎం చెబుతుందో చూద్దామా..?
పదేళ్ళలో 5 సార్లు మాత్రమే రిటర్న్స్
గత పదేళ్ళలో అక్టోబర్ 2011 సంవత్సరం మాత్రమే మదుపర్లకు 10శాతం లాభాలను తెచ్చిపెట్టింది. మొత్తం మీద చూస్తే.. కేవలం 5 సార్లే దివాలీ సీజన్ ఇన్వెస్టర్లకు కలిసొచ్చింది. ప్రముఖ స్టాక్ ఎనలిస్ట్ కంపెనీ ఏస్ ఈక్విటీ సర్వే ప్రకారం ఈ పదేళ్ల కాలంలో ప్రాఫిట్ రిటర్న్స్ పాజిటివ్‌గా ఉండటంలో 50 శాతం అవకాశాలు మాత్రమే వచ్చాయి. అక్టోబర్ 2011లో మాత్రమే సెన్సెక్స్ బాగా పుంజుకుంది. దాదాపు 10శాతం పెరుగుదలతో ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇక 2017 అక్టోబర్ కూడా మదుపర్లకు లాభాలనే తెచ్చి పెట్టింది. దాదాపు సెన్సెక్స్ 25-30 శాతం పెరిగింది. ఇక అక్టోబర్ 2013 మాత్రం మదుపర్లకు పీడకలనే మిగిల్చింది. దాదాపు మార్కెట్లు పతనం బాటలోనే ఉండిపోయాయి. 2008 అక్టోబర్ కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది.  ఈ నెలలో నెగిటివ్‌ రిటర్న్స్ 25శాతం దాకా పెరిగాయి. లెహమాన్ బ్రదర్స్ చేసిన బ్యాంక్రప్టసీ, గ్లోబల్ మార్కెట్లు పతనం వంటివి దేశీయ మార్కెట్లను దెబ్బతీసాయి. ఇదే 2009 లోనూ కొనసాగింది. దాదాపు 7శాతం సెన్సెక్స్ పడిపోయింది.

source : moneycontrol
2018 అక్టోబర్ తరువాత ఎలా ఉంటుందో..?
ఇక ఈ సంవత్సరం మార్కెట్ విభిన్న ఉపద్రవాలనే ఎదుర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం మిడ్‌ క్యాప్, స్మాల్ క్యాప్ రంగాలను కకావికలం చేయగా, అంతర్జాతీయ ట్రేడ్ వార్ (చైనా,అమెరికాల మధ్య)  క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల , రూపీ పతనానికి దారి తీసింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే..మార్కెట్ దాదాపు 2 శాతం పడిపోయే కనిపిస్తుంది. గత సంవత్సర లాభాలను ఈ రెండు నెలల్లోనే తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. మరి రానున్న నవంబర్ 7 న దీపావళి  సందర్భంగా మదుపర్ల ఆశలకు రెక్కలొస్తాయా లేదో తెలిసిపోతుంది. ఈ అక్టోబర్‌ మాసాంతానికి ఇండెక్స్ 7 శాతం నష్టపోవడం మదుపర్లను కలచివేస్తుంది. నవంబర్ డిసెంబర్ మాసాల్లో దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలుండటంతో ఎనలిస్టులు స్టాక్స్‌ను ఇప్పుడే పిక్ చేసుకోమని చెబుతున్నారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం గనుక ఏర్పడితే..ఇప్పుడు ఎంచుకున్న స్టాక్స్ లాభాలను తెచ్చిపెడతాయని వారంటున్నారు. ఈ పరిణామాల మధ్య  రాబోయే మూడేళ్ళల్లో నిఫ్టీ 15,000 పాయింట్ల వరకూ పెరుగుతుందని EVP మార్కెట్స్ & కార్పోరేట్ ఎఫైర్స్ ప్రతినిధి సంజీవ్ భాసిన్  అంచనా వేస్తున్నారు. అలాగే కార్పోరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌ను ఆశాజనక స్థితిలో ఉంచడానికి దోహదం చేస్తాయని ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ IIFL అంచనా వేస్తొంది. ఏది ఏమైనా మరి ఈ దీపావళి మీకు మరిన్ని లాభాలను తెచ్చి పెట్టాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

 

 Most Popular