ఈ కరెక్షన్‌లో కచోలియా కొన్న మిడ్‌ క్యాప్ స్టాక్స్ ఇవే...

ఈ కరెక్షన్‌లో కచోలియా కొన్న మిడ్‌ క్యాప్ స్టాక్స్ ఇవే...

మార్కెట్‌ అస్థిరత, నిరంతర దిద్దుబాటు ప్రక్రియ మదుపర్లను ఆందోళనకు గురి చేస్తుంది.  ఏ స్టాక్స్ కొన్నా  ప్రాఫిట్స్ సంగతి దేవుడెరుగు, ముందు పెట్టుబడులు కూడా మాయమయ్యే దుస్థితి నెలకొంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంత మంది ఇన్వెస్టర్లు ధైర్యంగా ముందడుగు వేసి మరీ లాభాల పంటను పండిస్తున్నారు. స్మాల్, మిడ్ క్యాప్ రంగంలో లాభాలు ఎక్కడున్నాయో తవ్వి తీసి మరీ వెతికి పట్టుకునే ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్‌ ఆశిష్ కచోలియా తన పోర్ట్‌ ఫోలియోను ఈ అక్టోబర్ మాసాంతానికి కొత్త సొబగులు అద్దారు. అవేంటో చూద్దామా...
కొన్నవి ఇవే...
2018 ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 40 శాతం పడిపోయిన 9 కంపెనీల స్టాక్స్ ను ఆశిష్ కొన్నారు. అంతే కాకుండా తన వద్ద ఉన్న స్మాల్, మిడ్‌ క్యాప్ పెట్టుబడులను మరింత పెంచారు కూడా. దీర్ఘ కాలంలో ఇవి లాభాల బాట పట్టనున్నాయని ఆయన అంచనా.  టైమ్ టెక్నో ప్లాస్ట్ , V2 రిటైల్, NIIT , నోసిల్, మాజెస్కో, మోల్డ్ -టెక్ ప్యాకేజింగ్, ఖాదీమ్ ఇండియా, హికాల్ , KPIT టెక్నాలజీస్ లో ఆశిష్‌ కచోలియా పెట్టుబడులు పెట్టారు. 2018లో  టైమ్‌ టెక్నో ప్లాస్ట్  షేర్ వాల్యూ దాదాపు 46శాతం పడిపోయింది. అదే విధంగా V2 రిటైల్ 37 శాతం, NIIT 30 శాతం పడిపోయిన షేర్లే కావడం ఇక్కడ గమనార్హం. BSE  సంస్థ ఈ అక్టోబర్ 28 న విడుదల చేసిన పోర్ట్ ఫోలియో జాబితాలో ఆశిష్ కచోలియా కొన్న స్టాక్స్ లిస్ట్ సర్వత్రా ఉత్కంఠను రేపింది. దాదాపు 30-45 శాతం పడిపోయిన మిడ్‌ క్యాప్ స్టాక్స్ ను ఎంచుకుని ఆశిష్ సాహసమే చేశాడా, లేక రాబోయే రోజుల్లో అధిక ప్రాఫిట్స్ ఎర్న్‌ చేయనున్నాడా అని మార్కెట్ విశ్లేషకులు ఎనలైజ్‌ చేయడం మొదలెట్టారు.

కాగా ఆశిష్ పోర్ట్ ఫోలియోలో దాదాపు 25 స్టాక్స్ ఉన్నాయి. వీటిలో రెండింటిలో తన పెట్టుబడులను 1 శాతానికి పైగా పెంచాడు. టైమ్‌ టెక్నో ప్లాస్ట్ స్టాక్స్‌లో 1.01 శాతం, హికాల్ స్టాక్స్‌లో 1.62 శాతం పెట్టుబడులను పెంచారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఎంటంటే.. టైమ్టెక్నో ప్లాస్ట్ చిన్న కంపెనీ ఎం కాదు. బహుళ జాతి కంపెనీగా దాదాపు  ఏడు దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించిన సంస్థ అది. బహ్రెయిన్ , ఈజిప్ట్, ఇండోనేషియా, ఇండియా, మలేషియా, UAE, సౌదీ అరేబియా వంటి దేశాల్లో పలు ఆపరేషన్లతో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న సంస్ధ టైమ్‌ టెక్నో ప్లాస్ట్ . పాలిమర్ ఉత్పత్తులు తయారు చేసే విషయంలో అపార అనుభవం కల సంస్థ అది. రానున్న రోజుల్లో పాలిమర్ ఉత్పత్తులకు గిరాకీ ఎక్కువ కానుండటం ఆశిష్ అంచనాలకు ఊతమిచ్చి ఉండవచ్చు.
ఇక హికాల్ సంస్థ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలకు, కెమికల్ కంపెనీలకు సొల్యూషన్స్ అందించే సంస్థ. యాక్టివ్ ఇన్‌గ్రేడెంట్స్, ఇంటర్‌మీడియెట్స్ ను R&D, గ్లోబల్ ఫార్మాస్యూటికల్స్ , యానిమల్ హెల్త్ , బయోటెక్ , క్రాప్ ప్రొటెక్షన్ వంటి రంగాలను సరఫరా చేస్తుంది. ఈ కంపెనీ కూడా రానున్న కొద్ది నెలల్లో గణనీయ లాభాలను తెచ్చిపెడుతుందని  ఆశిష్ అంచనా వేశారు.

వదిలించుకున్నవి ఇవే..
తన పోర్ట్ ఫోలియో పునర్‌నిర్మాణం కోసం ఆశిష్ కచోలియా కొన్ని స్టాక్స్ ను వదిలించుకున్నారు. శ్రేయాస్ షిప్పంగ్, వాడిలాల్ ఇండస్ట్రీస్, APL, అపోలో, పోకర్ణ, ఈస్టర్ ఇండస్ట్రీస్, KEI ఇండస్ట్రీస్, పరాగ్ మిల్క్ ఫుడ్స్ వంటి కంపెనీల స్టాక్స్‌ను విక్రయించారు.
కొనసాగించినవి ఇవి...
తన పోర్ట్ ఫోలియోలోని ఓ 9 స్టాక్స్‌ను మాత్రం నిలకడగా ఆశిష్ కొనసాగించారు.  విష్ణు సిమెంట్స్, Mirc ఎలక్టానిక్స్, బట్టర్‌ ఫ్లై గాంధీమతి, GHCL, CHD డెవలపర్స్, పాలి మెడిక్యూర్, ఆక్రిసిల్, షైలీ ఇంజనీరింగ్ , వైభవ్‌ గ్లోబల్ వంటి కంపెనీల స్టాక్స్‌ను ఆశిష్ కొనసాగించారు.
source : money controlMost Popular