ఫండ్ మేనేజర్లు వెంటాడి మరీ ఈ స్టాక్స్ ఎందుకు కొంటున్నారో తెలుసా !

ఫండ్ మేనేజర్లు వెంటాడి మరీ ఈ స్టాక్స్ ఎందుకు కొంటున్నారో తెలుసా !

మార్కెట్ బెంచ్ మార్‌ సూచీలు 10 శాతం గరిష్టానికి పడిపోయినా, మార్కెట్‌లో నెగిటివ్ ధోరణులు పెచ్చుమీరినా.. మిడ్‌ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల కొనుగోళ్లు పెరిగాయి. చాలా మంది ఫండ్‌ మేనేజర్లు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. పడిపోయిన షేర్లను , అందులోనూ మంచి స్టాక్స్ అనిపించిన వాటిని కొనుగోలు చేయడానికి వెనకంజ వేయడం లేదు ఫండ్ మేనేజర్లు.
ఈ సెప్టెంబర్ త్రైమాసికం నాటికి దాదాపు 310 స్టాక్స్‌లో వారు పెట్టుబడులను పెంచారు.లేదా కొనుగోలు చేశారు. దాదాపు రు.1000 కోట్ల విలువైన స్టాక్స్‌ను , అవీ 2018లో సుమారు 70శాతం పడిపోయిన షేర్లను వారు కొనుగోలు చేయడం ఆసక్తిని రేపుతుంది.

ఫండ్ మేనేజర్లు కొన్నవి ఇవే...
  గతంలో అత్యంత క్షీణతకు గురైన మన్‌ పసంద్ బేవరేజెస్‌ , ఇన్ఫీబీమ్ అవెన్యూస్, సింప్లెక్స్ ఇన్ఫ్రా, IIFL హోల్డింగ్స్, JM ఫైనాన్షియల్స్, నవకార్ కార్పోరేషన్, ఇండియన్ బ్యాంక్, సింఫనీ, కజారియా సిరామిక్స్, దిలిప్‌ బిల్డ్ కాన్, గ్రీన్‌ ప్లే ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. అయితే ఈ పరిణామాన్ని గమనిస్తున్న మార్కెట్ విశ్లేషకులు మాత్రం ఇది సరైన నిర్ణయమే అంటున్నారు. ఇప్పుడు పడిపోయినా.. దీర్ఘకాలంలో అంటే రానున్న 2-3 ఏళ్ళలో ఇవి లాభాల బాట పట్టొచ్చన్నది వారి అంచనా.

అంతే కాకుండా పడిపోయిన స్టాక్స్ లో ఉత్తమమైన స్టాక్స్‌ను ఎంపిక చేసుకోడం కూడా కత్తి మీద సామే అంటున్నారు ఎనలిస్టులు. స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ఇవి లాభాలను తీసుకు రావొచ్చని వారు పేర్కొన్నారు. మరి కొంత మంది మాత్రం ఇది చిన్న నీటి గుంటలో చేపలు పట్టడం లాంటిదని , దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా మూట కట్టుకుంటారని భావిస్తున్నారు. ఇలా వాల్యూ పడిపోయిన షేర్లను ఎంపిక చేసుకుంటున్నా... ఆయా స్టాక్స్ ఎంపికలో వాటి విలువ, ప్రాధమిక వాల్యూమ్స్ ను పరిగణనలోకి తీసుకోవాలని  కార్వే స్టాక్ బ్రోకింగ్ విశ్లేషకుడు వివేక్ రంజన్ అంటున్నారు. ఫండ్‌ మేనేజర్లు ఇప్పుడు ఎంచుకుంటున్న ఈ బీటెన్ డౌన్‌ స్టాక్స్ రానున్న 2-3 ఏళ్ళలో సక్సెస్‌ బాట పట్టొచ్చని వివేక్‌ రంజన్ పేర్కొన్నారు.
గత రెండు క్వార్టర్లలో పెరిగిన MF అసెట్స్
అయితే గత జూలై, సెప్టెంబర్ త్రైమాసికాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు దాదాపు రు.24 లక్షల కోట్లకు పెరిగాయి. కానీ గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. 14 శాతం తగ్గుదలే కనిపిస్తుంది. ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిళ్ళే దీనికి కారణం. ఈ సెప్టెంబర్‌లో S&P, BSE  సెన్సెక్స్ దాదాపు 2000 పాయింట్లు నష్టపోవడంతో అక్టోబర్ మాసాంతానికి కూడా ఈ స్టాక్స్ డౌన్‌ ఫాల్ కొనసాగవచ్చు. మ్యూచువల్ ఫండ్స్  అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా(AMFzi) తెలిపిన వివరాల ప్రకారం ఈ మూడు నెలల్లోనే 41 కంపెనీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ2.5 శాతం పెరిగి  రు. 23.4 లక్షల కోట్లుగా ఉందని తెలుస్తుంది.  మార్కెట్ల అస్థిరత వల్ల చాలా మంది సాధారణ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారని, దాదాపు  గత త్రైమాసికానికి మ్యూచువల్ ఫండ్స్‌లో రు.11,172 కోట్లు ప్రవహించాయని AMFzi తెలిపింది. అంటే ఫండ్‌ మేనేజర్లు పతనం బాటలో ఉన్న షేర్లను కొనడానికి ఇదొక మంచి అవకాశంగా భావించి ఉంటారు. ఇప్పుడున్న అస్థిర మార్కెట్లలో ఒక మంచి స్టాక్‌ను ఎంపిక చేసుకోడం చాలా కష్టతరమని, అలాగే పోర్ట్‌ ఫోలియోలో ఉన్న స్టాక్‌ను వదిలించుకోడం కూడా కష్టతరంగా మారిందని LIC మ్యూచువల్ ఫండ్ మేనేజర్‌ యోగేష్ పాటిల్ అంటున్నారు. ప్రాథమికంగా బలంగా ఉన్న కంపెనీలు, వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల స్టాక్స్ ను ఎంచుకోడం కొంత లాభసాటిగా ఉంటుందని యోగేష్ పాటిల్ పేర్కొన్నారు.
వదిలించుకున్నవి ఇవే...
కొన్ని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఈ 2018లో దాదాపు 80శాతం పతనమైన 270 కంపెనీల స్టాక్స్ ను వదిలించుకున్నారు. పీసీ జ్యూయల్లెర్స్, జెట్‌ ఏయిర్‌ వేస్, SREI ఇన్ఫ్రా, HCC , BEML, దివాన్ హౌజింగ్, సిండికేట్‌ బ్యాంక్, టాటా మోటార్స్, మోతీలాల్ ఓస్వాల్, అపెక్స్ ఫ్రోజన్‌, యూనియన్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్ ఆఫ్‌ ఇండియా , అవంతీ ఫీడ్స్, సౌత్‌ ఇండియన్ బ్యాంక్ వంటి కంపెనీల షేర్లను మ్యూచువల్ పండ్ కంపెనీలు వదిలేసుకున్నాయి.

రానున్న కొద్ది నెల్లోల మార్కెట్లు కాస్త కోలుకుంటాయని , అప్పుడు మళ్ళీ పెట్టుబడులు లాభాల బాటలో పయనిస్తాయని ఫండ్ మేనేజర్లు భావిస్తున్నారు. కానీ మరో రెండేళ్ల దీర్ఘకాలిక పెట్టుబడుల కోసమే ఈ బీటెన్ డౌన్‌ షేర్లను కొన్నారన్నది మాత్రం వాస్తవం.

 Most Popular