బ్రోకరేజ్‌ సంస్థలు ఈ 10 స్టాక్స్‌పైనే కన్నేశాయి...

బ్రోకరేజ్‌ సంస్థలు ఈ 10 స్టాక్స్‌పైనే కన్నేశాయి...

మధ్యస్థంగా ఉన్న అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయంగా అస్థిరతతో కొనసాగుతున్న మార్కెట్ల తీరు బట్టి  రిటైల్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్ ఫోలియోలను పెంచుకోడానికి ఇదే మంచి తరుణమని స్టాక్ ఎనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు. రానున్న 2-3 సంవత్సరాలకు గానూ ఇప్పుడు స్టాక్స్‌ను పిక్ చేసుకుంటే లాభాలను కళ్ళ చూడొచ్చంటున్నారు వారు. ఇప్పుడు షేర్ల ధరలు తగ్గుముఖంలో ఉన్నాయి కాబట్టి మంచి స్టాక్స్ ను ఎంపిక చేసుకుంటే రానున్న రెండు మూడేళ్ళలో అవి మంచి ప్రాపిట్స్ ను ఇవ్వనున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. 2018 అక్టోబర్ నాటికి S&P BSE 7శాతం పతనంతో దాదాపు 2000 పాయింట్లను నష్టపోయింది. గత 29 డిసెంబర్‌లోనూ , ఈ 24 అక్టోబర్‌లోనూ సెన్సెక్స్ 34,056 వద్ద ముగిసింది. ఇండెక్స్ గరిష్ట పతనం 34,033 పాయింట్ల వద్ద నిలిచింది. ఇంత పతన స్థితిలో మార్కెట్లు మనుగడ సాగిస్తున్నప్పుడు స్టాక్స్ ధరలు పతనం బాటలోనే ఉంటాయి. IL&FS సంక్షోభం, రూపీ డాలర్‌తో మారకపు క్షీణత, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, మార్కెట్లలో నగదు కొరత వంటివి అనేక కంపెనీల స్టాక్స్ ను దెబ్బతీశాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. రానున్న రెండు మూడేళ్ళ  కాలం కోసం మంచి స్టాక్స్‌ను ఎంపిక చేసుకోడానికి ఇదే ఉత్తమమైన సమయమని అవి భావిస్తున్నాయి.
2018 అక్టోబర్ 24 నాటికి కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ఎంచుకున్న స్టాక్స్‌ను మనం కూడా ఓ సారి పరిశీలిద్దాం..


కోటక్ మహీంద్ర బ్యాంక్
ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ CLSA  కోటక్ మహీంద్ర బ్యాంక్ పనితీరును అంచనా వేసి ముందు ముందు లాభాలను తెచ్చిపెట్టేదిగా కోటక్‌ను పరిగణిస్తుంది. ఈ క్వార్టర్‌ -2 ఫలితాల్లో కాస్త మంచి ఫలితాలనే నమోదు చేసిన కోటక్‌ బ్యాంక్‌ స్టాక్స్ రానున్న 12 నెలల టార్గెట్‌ ధర రు.1420 -1480 వరకూ పెరగొచ్చని అంచనా వేసింది. బ్యాంక్ కోర్‌ ప్రాఫిట్స్ ఆరోగ్యకరంగా ఉండటం, పెట్టుబడుల విధానాలు లాభాలను తగ్గించడం జరిగినా.. ముందు ముందు బ్యాంకు పనితీరు మెరుగ్గా ఉండొచ్చన్నద్ది CLSA సంస్థ  అంచనా.  క్యాపిటలైజేషన్, డిపాజిట్ల గ్రోత్ బాగా ఉండటం కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌కు కలిసొచ్చే అంశం.  
కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ : కొనచ్చు : లాస్ట్ ట్రేడింగ్ ప్రైజ్‌ (LTP) రు. 1177: టార్గెట్‌ రు. 1420: రిటర్న్స్ అంచనా 20శాతం.


క్యాడిలా హెల్త్‌ కేర్
సిటీ గ్రూప్‌ బ్రోకరేజ్ సంస్థ క్యాడిలా హెల్త్‌ కేర్‌కు మంచి రేటింగ్స్ ఇచ్చింది. ది హెంజ్‌ ఇండియా ఆక్విజిషన్ కంపెనీ మాతృసంస్థగా కలిగిన క్యాడిలా  మార్కెట్ వాల్యూ రు. 4,595కోట్లుగా ఉంది. అంతే కాకుండా జైడస్‌ గ్రూప్ ఈ కంపెనీని కొనుగోలు చేయడం కూడా హెంజ్‌కు లాభసాటిగా మారింది.
క్యాడిలా హెల్త్‌ కేర్ : కొనచ్చు : లాస్ట్ ట్రేడింగ్ ధర రు. 358.40: టార్గెట్‌ ధర రు.450: రిటర్న్స్ 25శాతం


అపోలో టైర్స్
ఈక్విరిస్‌ సెక్యూరిటీస్  అపోలో టైర్స్ రెండో క్వార్టర్‌ ఫలితాలను బట్టి దాని కొనుగోలు ధర టార్గెట్‌ను  రు. 204 గా భావిస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగదల, కరెన్సీ ఒత్తళ్ళు ఉన్నప్పటికీ గత మూడు నెలల నుంచి అపోలో టైర్స్ స్థిర వృద్ధిని కనబరుస్తుంది. అంతర్జాతీయ అమ్మకాలు వేగంగా విస్తరిస్తుండటం అపోటో టైర్స్ కు కలిసొచ్చే అంశం. ఈక్విరిస్ సెక్యూరిటీస్ రానున్న ఆర్ధిక సంవత్సరం కల్లా అపోలో స్టాక్స్ 16 రెట్లు లాభాలను తెచ్చిపెట్టనున్నాయని అంచనా వేస్తుంది.
అపోలో టైర్స్: కొనచ్చు : లాస్ట్ ట్రేడింగ్ ధర రు. 204: టార్గెట్‌ ధర రు. 270 :  రిటర్స్ 32 శాతం అంచనా


విప్రో
ఎలారా క్యాపిటల్స్  విప్రో స్టాక్స్‌పై పూర్తి నమ్మకముంచింది. విప్రో టార్గెట్ ప్రైజ్‌ రు. 405గా ఎలారా క్యాపిటల్‌ అంచనా వేస్తోంది.  గత త్రైమాసికానికి ఇప్పటి త్రైమాసికానికి  విప్రో 1.6శాతం వృధ్ధిని కనబరిచింది. అలాగే విప్రోకు రానున్న 10 సంవత్సరాలకు గాను 1.5 బిలియన్ డాలర్ల ఆర్డర్లను అలైట్ కంపెనీ నుండి రావడం కూడా కంపెనీ వాల్యూమ్‌ను పెంచింది.
విప్రో: కొనచ్చు: లాస్ట్ ట్రేడింగ్ ధర రు. 309 : టార్గెట్‌ ప్రైజ్ రు. 405: రిటర్న్స్ 31 శాతం


ఒబెరాయ్ రియాల్టీ
ఈ కార్వర్ట్ 2 ఫలితాలను బట్టి ఒబెరాయ్ రియాల్టీ స్టాక్స్ టార్గెట్‌ ధర రు. 550గా ఎలారా క్యాపిటల్‌ అంచనా వేస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ఒబెరాయి రియాల్టీ 95 శాతం రెవిన్యూను వృద్ధి చేసుకుంది. నిర్వాహణలో అత్యధిక పారదర్శకత కలిగి ఉండటం, మంచి ఆస్తుల నిర్వాహణ,  సత్వర ప్రాజెక్ట్‌ల నిర్వాహణ రికార్డ్ కలిగి ఉండటం కంపెనీపై అంచనాలను అధికం చేశాయి.
ఒబెరాయ్ రియాల్టీ: కొనచ్చు: లాస్ట్ ట్రేడింగ్ ధర. రు. 432: టార్గెట్ ప్రైజ్‌ రు. 550 : రిటర్న్స్ 27శాతం అంచనా


హీరో మోటార్‌ కార్ప్
ఎలారా క్యాపిటల్‌ హీరో మోటో కార్ప్‌ టార్గెట్‌ ధరను రు. 3751 గా అంచనా వేసింది. మోటార్ సైకిల్  అమ్మకాల్లో హీరో మోటార్స్ అత్యధిక అమ్మకాలతో బ్రోకరేజ్ సంస్థలను తన వైపు తిప్పుకుంది. కంపెనీ లాభాలు ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి 4-5 శాతం పెరగొచ్చని ఎలారా క్యాపిటల్‌ భావిస్తుంది. పండుగ సీజన్లలో అమ్మకాలు గణనీయంగా పెరగడం కూడా హీరో మోటర్స్ కు కలిసొచ్చిన అంశం.
హీరో మోటో కార్ప్‌ ; కొనచ్చు: లాస్ట్ ట్రేడింగ్ ధర. రు.2,702 : టార్గెట్‌ ప్రైజ్‌ రు. 3,751: రిటర్న్ 38శాతం అంచనా


షిన్ పేయింట్స్
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ BofAML ఈ క్యూ -2 ఫలితాల తరువాత ఏషియన్ పేయింట్స్ టార్గెట్ ధర రు.1650గా అంచనా వేసింది. కంపెనీ హెల్దీ వాల్యూమ్ ప్రభావం చూపినా, వీక్ మార్జిన్లు నమోదు చేసింది ఏషియన్ పెయింట్స్. కానీ రానున్న మరి కొద్ది నెలల్లో గృహ నిర్మాణ రంగం ఊపందుకోనుండటంతో సంస్థ అమ్మకాలు జోరందుకోనున్నాయి. సంస్థ ట్రాక్ రికార్డ్, ఆస్తుల విలువ కంపెనీ వాల్యూను పెంచుతాయని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఏషియన్ పేయింట్స్: కొనచ్చు : లాస్ట్ ట్రేడింగ్ ప్రైజ్‌ రు. 1189: టార్గెట్‌ ప్రైజ్‌. రు. 1650: రిటర్న్స్ 38శాతం అంచనా


ఐనాక్స్ లీజర్‌
CLSA బ్రోకింగ్ సంస్థ ఐనాక్స్ లీజర్‌ స్టాక్స్ ను మంచి ఎంపికగా అభివర్ణించింది. ఐనాక్స్ టార్గెట్ ధరగా రు. 275గా అంచనా వేస్తొంది. అయితే ఈ త్రైమాసికానికి తక్కువ ఫలితాలను వెల్లడించింది ఐనాక్స్. బుక్ మైషో వంటి రంగాల్లో సాధారణ ఫలితాలనే నమోదు చేసింది ఐనాక్స్ లీజర్. ఐనప్పటికీ స్థిర ప్రకటనల ఆదాయం కంపెనీపై అంచనాలను పెంచుతుంది. అంతేకాకుండా కంపెనీ విస్తరణకు అవసరమైన అన్ని చర్యలను చేపడ్తామని మేనేజ్‌ మెంట్ పునరుద్ఘాటించింది. దీంతో బ్రోకరేజ్ సంస్థలు కంపెనీపై అంచనాలు పెట్టుకున్నారు.
ఐనాక్స్ లీజర్‌ : కొనచ్చు: లాస్ట్ ట్రేడింగ్ ధర. రు. 207; టార్గెట్‌ ధర రు.275: రిటర్న్స్ 32శాతం


అల్ట్రా టెక్ సిమెంట్
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నోమురా సెక్యూరిటీస్  ఆల్ట్రాటెక్ సిమెంట్ టార్గెట్ ధర రు. 5150 గా అంచనా వేస్తొంది. కానీ కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ మూడో క్వార్టర్‌కల్లా కంపెనీ అమ్మకాలు పెరుగుతాయని,  సిమెంట్ ధరలు కూడా పెరగొచ్చన్న వార్తలు ఆల్ట్రా టెక్‌ మీద అంచనాలను పెంచుతున్నాయి. మోర్గాన్ స్టాన్లీ కూడా ఆల్ట్రాటెక్ టార్గెట్ ధర రు. 4954 గా అంచనా వేస్తొంది. కంపెనీ వాల్యూమ్ గ్రోత్ కూడా రానున్న ఆర్ధిక సంవత్సరానికి పెరగనున్నట్టు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
 అల్ట్రా టెక్ సిమెంట్ : కొనచ్చు: లాస్ట్ ట్రేడింగ్ ధర రు.3387: టార్గెట్ ప్రైజ్‌ రు. 5150: రిటర్న్స్ 52శాతం అంచనా


ACC (అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ )
CLSA బ్రోకరేజ్ సంస్థ  ACC రెండో క్వార్టర్ ఫలితాల తరువాత టార్గెట్ ధర రు. 1900గా అంచనా వేస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ACC 15శాతం వృద్ధిని కనబరిచింది. ఈ సెప్టెంబర్ త్రైమాసికానికి కంపెనీ నెట్ ప్రాఫిట్ రు.209.1 కోట్లుగా ఉంది. డాయిష్ బ్యాంక్ కూడా ACC కంపెనీ టార్గెట్ ధర రు.1730గా అంచనా వేస్తుంది.  
ACC : కొనచ్చు : లాస్ట్ ట్రేడింగ్ ప్రైజ్‌ రు. 1380: టార్గెట్ ధర. రు. 1900; రిటర్న్స్ 39శాతం అంచనా

 Most Popular