మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ పాయింట్ తీసుకోవాల్సిన టాప్ 5 కారణాలు ఇవే ?

మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ పాయింట్ తీసుకోవాల్సిన టాప్ 5 కారణాలు ఇవే ?

మ్యూచువల్ ఫండ్స్ అనగానే ప్రతీ ఒక్కరు తమ పెట్టుబడి సేఫ్ అనే ఉద్దేశ్యంతో మదుపు చేయడం సహజమే కానీ అందులో ఎంట్రీ అయితే సులభమే. కానీ ఎగ్జిట్ ఎక్కడ అనేది చాలా మందికి ప్రశ్నార్థకమే. కొన్ని షేర్ల తరహాలోనే మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ కదలికలకు లోబడే ఉంటాయి. కొన్ని రకాల ఫండ్స్ ఏ మాత్రం గ్రోత్ లేకుండా అలా మూలనపడి ఉంటాయి. కొన్ని రకాల ఫండ్స్ స్థిరమైన ఆదాయాన్నిస్తూ ఉంటాయి. ఎలాంటి సిట్యూయేషన్ లో ఫండ్స్   నుంచి బయట పడాలో చూద్దాం.

1. ఈక్విటీ మార్కెట్లలో అసాధారణ కదలికల సమయంలో : 
చాలా మంది ఈక్విటీ మార్కెట్లు నూతన గరిష్ట స్థాయిలను తాకిన సందర్భంలో లాభాలను నమోదు చేయాలని చూస్తుంటారు. లేదా మార్కెట్లు పతనంలో ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడాలని చూస్తుంటారు. అయితే ఇది అంతగా కలిసిరాని వ్యూహం అనే చెప్పవచ్చు. ఎందుకంటే మీ ఫండ్ మేనేజర్ ఎప్పటికప్పుడు మార్కెట్ ను సమీక్షిస్తూ మీ నష్టాలను తగ్గించే పనిలో ఉంటారు. మార్కెట్ కదలికలను బట్టి మీ ఫండ్ పోర్టు ఫోలియోను మార్చుతూ ఉంటారు. ఈ కోణంలో ఎంఎఫ్ లను నుంచి ఎగ్జిట్ పోజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 

2. ఫండ్ పట్ల సమీక్షించుకోవాల్సిన సమయం ఏది ? 
మీ ఫండ్ మేనేజర్ మార్పును ప్రమాద ఘంటికగా గుర్తించాలి. మీ ఫండ్ హౌస్ ఫండ్ మేనేజ్ మెంట్ ఆధారంగానే మీ ఫండ్స్ పెరుగుదల ఆధారపడి ఉంటుంది. స్టాక్స్ ఎంపికలో క్రమశిక్షణతో పాటు నైపుణ్యం కూడా ఉంటేనే ఫండ్ మేనేజ్ మెంట్ ముందుకు సాగుతంది. ఈ నేపథ్యంలో మీరు ఎంపిక చేసుకున్న ఫండ్ పట్ల మీకు అసంతృప్తి ఉంటే మాత్రం మీరు ఎగ్జిట్ తీసుకోవడానికి ఆలోచించాలి. మీ పెట్టుబడికి ఆశించిన  స్థాయిలో రిటర్న్ రాకపోతే మాత్రం మీ ఫండ్ ను తిరిగి సమీక్షించుకోవాలి. అంతే కాదు మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ సలహా మేరకు ఫండ్ నుంచి నిష్క్రమించాలి. 

3. అత్యవసర సమయాల్లో : 
మనం ఎంత మదుపు చేసినప్పటికీ అత్యవతసర సమయాల్లో అది అవసరానికి ఉపయోగపడనప్పుడు వృధా అనే చెప్పవచ్చు. ఎందుకంటే మీకు ఆరోగ్యం, విద్య విషయంలో డబ్బు అవసరం చాలా ఉంటుంది. అప్పుడు మార్కెట్ తో సంబంధం లేకుండా మీ పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. మీ ఫైనాన్స్ అడ్వైజర్ సలహా మాత్రం తప్పక తీసుకొని ఈ చర్యకు దిగితే ఉత్తమం 

4. మీ లక్ష్యానికి చేరువలో ఉన్నారా ? 
ఎంఎఫ్ ఫండ్లలో పెట్టుబడికి అసలు లక్ష్యం విద్య, వివాహ, వాహన కొనుగోలు వంటి వాటి కోసం పెడుతుంటారు. అయితే సదరు ఫండ్స్ మీరు ఎంపిక చేసుకున్న లక్ష్యానికి సమీపంలో చేరుకొని మరో సంవత్సరం లేదా కొద్ది నెలల్లో పూర్తి కావొస్తే మాత్రం మీ సొమ్మును ఇతర లాభదాయక పథకాల్లో మళ్లించవచ్చు. ఉదాహరణకు మీ పెట్టుబడిని ఏదైనా డెట్ ఫండ్, లేదా స్టిస్టమేటిక్ ట్రాన్స్ ఫర్ ప్లాన్ వైపు మళ్లించవచ్చు. తద్వారా మీ పెట్టుబడికి పన్ను మినహాయింపులు, అలాగే అధిక లాభం పొందే వీలుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మీ ఫైనాన్స్ అడ్వైజర్ సలహా మాత్రం తప్పక తీసుకొని ఈ చర్యకు దిగితే ఉత్తమం

5. ఫండ్స్ ను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.
ప్రతీ సంవత్సరం మీ ఫండ్స్ ను లక్ష్యానికి తగ్గట్టుగా కదులుతున్నాయా లేదా అనేది సమీక్షించుకోవాలి. ఈక్విటీ మార్కెట్లలో ఓలటాలిటీ వల్ల మీ ఫండ్స్ కదలికలు 5 శాతానికి ఎక్కువ, తక్కువగా ఉన్న సందర్భంలో సమీక్షించుకోవాలి. అయితే వెంటనే మీ ఫండ్స్ ను మార్చుకోవద్దు. మీ ఫండ్స్ ను కనీసం 3 నుంచి 5 సంవత్సరాల వరకూ పెట్టుబడి పెట్టి వేచి చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సమీక్షించుకోవాలి. ఈక్విటీ మార్కెట్లలో కదలికల కారణంగా మీ ఫండ్స్‌లో  రికార్డు స్థాయిలో లాభం  వస్తే మాత్రం తప్పకుండా సొమ్ము చేసుకోవాలి.   Most Popular