రేటింగ్ డౌన్‌గ్రేడ్‌- అల్ట్రాటెక్‌ వీక్‌

రేటింగ్ డౌన్‌గ్రేడ్‌- అల్ట్రాటెక్‌ వీక్‌

పలు విదేశీ బ్రోకింగ్‌ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రకటించిన ఫలితాల ఆధారంగా టార్గెట్‌ ధరలను కుదించడంతో అల్ట్రాటెక్ సిమెంట్‌ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. వివరాలు చూద్దాం..

నేలచూపులో
క్యూ2 ఫలితాల నేపథ్యంలో విదేశీ బ్రోకింగ్‌ దిగ్గజం క్రెడిట్‌ స్వీస్‌ అండర్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తాజాగా పేర్కొనడంతో సిమెంట్‌ రంగ దిగ్గజం అల్ట్రాటెక్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలోఈ షేరు 3.5 శాతం క్షీణించి రూ. 3485 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 3598 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరగా.. రూ. 3460 వద్ద 21 నెలల కనిష్టాన్ని సైతం తాకింది. శుక్రవారం సైతం ఈ షేరు 3.5 శాతం తిరొగమించిన సంగతి తెలిసిందే.

Image result for target price downgrades
రూ. 3300 టార్గెట్‌
క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో అల్ట్రాటెక్‌ ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో క్రెడిట్‌ స్వీస్‌ షేరు టార్గెట్‌ ధరను రూ. 3500 నుంచి రూ. 3300కు కుదించింది. ఈ బాటలో ఇతర రీసెర్చ్‌ దిగ్గజాలు ఎడిల్‌వీజ్‌ రూ. 4779 టార్గెట్‌ను రూ. 4411కు తాజాగా పరిమితంచేయగా, డాయిష్‌ బ్యాంక్‌ రూ. 4760 ధరను రూ. 4500కు తగ్గించింది. అయితే నోమురా రూ. 5150 ధరను అంచనా వేస్తోంది. 
ఫలితాలు వీక్‌
క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో అల్ట్రాటెక్‌ నికర లాభం 9 శాతం క్షీణించి రూ. 391 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 21 శాతం పుంజుకుని రూ. 7771 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 7 శాతం తక్కువగా రూ. 1207 కోట్లకు పరిమితంకాగా.. ఇబిటా మార్జిన్లు 20.1 శాతం నుంచి 15.5 శాతానికి బలహీనపడ్డాయి. గత శుక్రవారమే కంపెనీ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.Most Popular