షార్ట్ టర్మ్ లాభాల కోసం ఈ స్టాక్స్‌ను చూడండి...

షార్ట్ టర్మ్ లాభాల కోసం ఈ స్టాక్స్‌ను చూడండి...

గత వారం ఇండెక్స్ దాదాపు 169 పాయింట్లు నష్టపోయి.. 11,303 వద్ద ముగిసింది. గత  రెండు నెలలుగా దాదాపు 16శాతం స్ట్రాంగ్ కరెక్షన్ తో 11,752 వద్ద నుండి పడిపోవడం మనం గమనించవచ్చు . మరి మార్కెట్లోని ఒడుదిడుకులు తట్టుకోడం ఎలా.. ? షార్ట్ టర్మ్ లాభాల కోసం ఏ ఏ స్టాక్స్‌ను ఎంచుకోవాలి.? ఇలాంటి ప్రశ్నలు సాధారణ మదుపర్లకు రావడం సహజం. ఈ ప్రశ్నలకు సమాధానాలను ప్రముఖ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్, LKP సెక్యూరిటీస్  రోహిత్ సింగ్రే  మాటల్లోనే చూద్దాం.

సాంకేతికంగా చెప్పాలంటే.. గత రెండు నెలలుగా పైపైకి దూసుకెళ్తున్న ఛానెల్‌లో ఇండెక్స్ ట్రేడింగ్  జరిగింది.  దాని మీదే ఇటీవల కరెక్షన్స్ చోటు చేసుకున్నాయి. ప్రస్తుత ధరలు లోయర్ బ్యాండ్‌లో ట్రేడ్ అవుతుండటం వల్ల ఇండెక్స్ సూచీలు 10,200 మధ్య కదలాడవచ్చు. ఇండెక్స్ 10,200 పైనా, లేదా మునపటి  లో స్వింగ్ ఐన 10,138 జోన్లో నిలదొక్కుకోగలిగితే మనం నిఫ్టీలో ఒక బౌన్స్‌ను చూడొచ్చు. ఒక వేళ అమ్మకాల ఒత్తిడి కొనసాగితే ఇండెక్స్ 10,000-9,950 మధ్యకు రావొచ్చు. ఇలా ఇండెక్స్ కరెక్షన్ మోడ్ లో ఉండి అస్థిరత పెరిగే ఛాన్స్ ఉన్నపుడు మదుపర్లు వేచి చూసే ధోరణినే అవలంబించాలి. ఇండెక్స్ 10,000 పైన స్థిరంగా ఉన్నట్టనిపించినపుడు స్టాక్స్‌ను డిప్ చేయడం లాభమని స్టాక్ ఎనలిస్టులు అంటున్నారు. అవీ ఎలాంటి స్టాక్స్ అంటే.. సన్ ఫార్మా, డాబర్, ITC, RBL బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బయోకాన్ , L&T టెక్నాలజీ సర్వీసెస్  లాంటివి టెక్నికల్లీ షార్ట్ టర్మ్ కోసం మనం ఎంచుకోవచ్చు. వీటిలో షార్ట్ టర్మ్ ప్రాతిపదికన సుమారు 10-15శాతం రిటర్న్స్‌ను ఆశించవచ్చు.

ప్రస్తుతం సన్ ఫార్మా 0.44శాతం వృద్ధితో రు. 611.05 వద్ద ట్రేడ్ అవుతోంది. డాబర్ ఇండియా లిమిటెడ్ 1.95శాతం పెరిగి రు. 412.25 వద్ద ట్రేడ్ అవుతోంది. బయోకాన్  3.04శాతం పెరిగి రు. 678.45 గా ఉంది. ఫెడరల్ బ్యాంక్  0.25శాతం పెరిగి రు. 81.40 వద్ద ట్రేడ్ అవుతోంది.Most Popular