ఆర్‌బీఎల్‌, ఏయూస్మాల్‌, నెల్కో డౌన్‌

ఆర్‌బీఎల్‌, ఏయూస్మాల్‌, నెల్కో డౌన్‌

విదేశీ రీసెర్చ్‌ దిగ్గజం మోర్గాన్‌స్టాన్లీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ప్రయివేట్‌ రంగ సంస్థలు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, యస్ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో నెల్కో లిమిటెడ్‌ కౌంటర్‌లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. వివరాలు ఇవీ...

Image result for au small finance bank Image result for au small finance bank and Yes bank and RBL bank

ప్రయివేట్‌ బ్యాంక్స్‌ వీక్‌
పెరుగుతున్న వడ్డీ రేట్లు, బ్యాంకింగేతర ఫైనాన్స్‌ కంపెనీలలో కొనసాగుతున్న విపత్కర పరిస్థితులు వంటి అంశాల నేపథ్యంలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను అండర్‌వెయిట్‌కు సవరిస్తున్నట్లు విదేశీ బ్రోకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేరు 7.2 శాతం పతనమై రూ. 470 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 510 వద్ద గరిష్టాన్నీ, రూ. 460 దిగువన కనిష్టాన్ని తాకింది. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సైతం 5.3 శాతం పతనమైంది. రూ. 511 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 501 దిగువన 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో యస్‌ బ్యాంక్‌ సైతం తొలుత ఎన్‌ఎస్‌ఈలో రూ. 209 దిగువకు నీరసించింది. ప్రస్తుతం 0.8 శాతం నష్టంతో రూ. 216 వద్ద ట్రేడవుతోంది.

Related image

నెల్కో లిమిటెడ్‌
శాటిలైట్‌ ఆధారిత నెట్‌వర్క్‌ కమ్యూనికేషన్స్‌ సొల్యూషన్స్‌ అందించే నెల్కో లిమిటెడ్‌ ఈ ఏడాది క్యూ2లో రూ. 10 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 254 శాతం అధికంకాగా.. ఇందుకు ప్రధానంగా పన్ను లాభాలు కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. మొత్తం ఆదాయం సైతం 25 శాతం పెరిగి రూ. 45 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 228 వద్ద ఫ్రీజయ్యింది. ఇంట్రాడేలో రూ. 247 వద్ద గరిష్టాన్నీ, రూ. 228 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. Most Popular