ఇదీ రాకేష్ ఝున్ ఝున్ వాలా కొత్త పోర్ట్ ఫోలియో...

ఇదీ రాకేష్ ఝున్ ఝున్ వాలా కొత్త పోర్ట్ ఫోలియో...

దేశీయ మార్కెట్లలో బిగ్ బుల్ రాకేష్ ఝున్ ఝున్ వాలా తన పోర్ట్ ఫోలియోలో కొత్త కంపెనీలను జత చేశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ... తన పోర్ట్ ఫోలియోలో ఫోర్టిస్ హెల్త్ కేర్, స్పైస్ జెట్‌ను యాడ్ చేశారు. అంతే కాకుండా దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్‌లో తన పెట్టుబడులను మరింత పెంచారు. అదేవిధంగా NCC కంపెనీలో కూడా స్టాక్స్ పెంచారు. ఝున్ ఝున్ వాలా కంపెనీ అయిన రేర్ ఎంటర్‌ప్రైజెస్ తరఫున తన భార్య పేరు కలిసి వచ్చేలా రాకేష్ రాధేశ్యామ్ ఝున్ ఝున్ వాలా పోర్ట్ ఫోలియోలో కొత్త స్టాక్స్ ను ఎంపిక చేసుకున్నారు రాకేష్. ఈ సెప్టెంబర్ త్రైమాసికానికి 13 కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించాయి. రాకేష్ ఝన్ ఝున్ వాలా ఆ 13 కంపెనీల్లో 7 కంపెనీల్లో తన వాటాను స్థిరంగా ఉంచారు. ఆగ్రోటెక్ ఫుడ్స్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ , MAN ఇన్ఫ్రా కన్‌స్ట్రక్షన్స్, MCX, ది మంధాన రిటైల్ వెంచర్స్ లో తన పెట్టుబడులను కొనసాగించారు. ఇక NBFC రంగంలో IL&FS సంక్షోభం తరువాత  సెప్టెంబర్ త్రైమాసికానికి 57శాతం పతనమైన దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ లో తన పెట్టుబడులను మరింత పెంచారు రాకేష్.
పడుతున్న కంపెనీల్లో పెట్టుబడులు...
జూన్ త్రైమాసికానికి DHFLలో 2.76శాతం వాటాను కలిగిఉన్న రాకేష్ ఝున్ ఝున్ వాలా ఈ సెప్టెంబర్ త్రైమాసికానికల్లా 3.19శాతం పెట్టుబడులు పెట్టారు. 43 బేసిస్ పాయింట్లను రాకేష్ పెంచుకున్నారు. విభిన్న , వైవిధ్యమైన పోర్ట్ ఫోలియో కలిగిన రాకేష్ ఝన్ ఝున్ వాలాను ఇండియన్ వారెన్ బఫెట్‌గా ఫోర్బ్స్ ఇండియా అభివర్ణించింది. ఈ ఏస్ ఇన్వెస్టర్ దేశంలోని బిలియనీర్లలో 61 స్థానం కల్పించింది ఫోర్బ్స్. రాకేష్ ఆస్తుల  నికర విలువ 2.5 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ లెక్క కట్టింది. గత జూలై నుండి రాకేష్ పోర్ట్ ఫోలియోలోని మిడ్ క్యాప్ షేర్లు దాదాపు 78శాతం పతనాన్ని చవి చూశాయి. వాటిలో DHFL 58శాతం, జయప్రకాష్ అసోసియేట్స్ 54శాతం, స్పైస్ జెట్ 32శాతం , ఆప్‌టెక్ 24శాతం , ఆగ్రో టెక్ ఫుడ్స్ 20శాతం పతనాన్ని ఎదుర్కొన్నాయి. 2018లో దాదాపు 50శాతం నష్టపోయిన స్పైస్ జెట్‌లో కూడా రాకేష్ తన స్టాక్స్ ను 1.25 శాతం పెంచారు. అలాగే ఫోర్టీస్ హెల్త్ కేర్‌ షేర్లను తన పోర్ట్ ఫోలియోలో యాడ్ చేశారు. 2శాతం అంటే 1.25 కోట్ల షేర్లను ఆయన కొనుగోలు చేశారని బాంబే స్టాక్ ఎక్సేంజ్(BSE)  అక్టోబర్ 16 న వెలువరించిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాకేష్ పోర్ట్ ఫోలియోలో ఉన్న షేర్లన్నీ..ఈ ఆర్ధిక సంవత్సరంలో  సుమారు 14శాతం నష్టపోయినవే కావడం విశేషం. తన వద్ద నున్న మూడు కంపెనీల స్టాక్స్ ను మాత్రమే రాకేష్ అమ్మివేసారు. క్రిసిల్, జయప్రకాష్ అసోసియేట్స్, ల్యుపిన్ కంపెనీల స్టాక్స్ ను సెప్టెంబర్ త్రైమాసికంలో రాకేష్ విక్రయించారు.  Most Popular