ఐబీ హౌసింగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్లస్‌

ఐబీ హౌసింగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్లస్‌

యూకే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గృహ రుణాల సంస్థ ఓక్‌నార్త్‌లో వాటా విక్రయించనున్నట్లు వెలువడ్డ అంచనాల కారణంగా దేశీ ఫైనాన్షియల్‌ సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. మరోపక్క ఈ ఏడాది(2018-19) రెండో క్వార్టర్(క్యూ2)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కౌంటర్‌ కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..

ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఓ ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ) ఫండ్‌కు ఓక్‌నార్త్‌లో వాటాను విక్రయించే వీలున్నట్లు వార్తలు వెలువడటంతో ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ డీల్‌ ఇన్వెస్టర్లు దృష్టిపెట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 683 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 700 వద్ద గరిష్టాన్నీ, రూ. 663 వద్ద కనిష్టాన్నీ తాకింది. డీల్‌ కుదిరితే ఐబీ హౌసింగ్‌ పెట్టుబడులపై ఆరు రెట్లు రిటర్న్‌ లభించగలదన్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

Image result for hdfc bank

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం దాదాపు 21 శాతం పెరిగి రూ. 5006 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఎం) సైతం 21 శాతం పుంజుకుని రూ. 11,763 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ మార్జిన్లు 4.3 శాతంగా నమోదుకాగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.33 శాతం వద్దే స్థిరంగా నిలిచాయి. నికర ఎన్‌పీఏలు 0.41 శాతంగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 2001 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2020 వద్ద గరిష్టాన్నీ, రూ. 1989 వద్ద కనిష్టాన్నీ తాకింది. కాగా.. క్రెడిట్‌ స్వీస్‌, సిటీ, మోర్గాన్‌ స్టాన్లీ తదితర విదేశీ రీసెర్చ్‌ దిగ్గజాలు రూ. 2500 టార్గెట్‌ ధరతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కౌంటర్‌కు బయ్‌ రేటింగ్‌ను ప్రకటించాయి.Most Popular