రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోకి SBI మాజీ ఛైర్‌ పర్సన్ అరుంధతీ భట్టాచార్య...

రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోకి SBI మాజీ ఛైర్‌ పర్సన్ అరుంధతీ భట్టాచార్య...

ఎస్బీఐ బ్యాంకు పగ్గాలు అందుకున్న తొలి మహిళగా రికార్డు నెలకొల్పిన అరుంధతీ భట్టాచార్య ఇప్పుడు రిలయన్స్ లో రెండో మహిళా డైరెక్టర్‌గా చేరారు. ఇప్పటికే రిలయన్స్ లో మహిళా డైరెక్టర్‌గా నీతా అంబానీ కొనసాగుతున్నారు. ఈ అక్టోబర్ 17 నుండి 5 ఏళ్ళపాటు రిలయన్స్ బోర్డ్‌లో అరుంధతి కొనసాగుతారు. ఇందుకు గాను కంపెనీ బోర్డ్ , షేర్ హోల్డర్స్ ఆమోదం తెలిపారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.  
తొలుత క్రిస్ క్యాపిటల్ ఆమెను తమ కంపెనీ సలహాదారుగా నియమించింది. అంతే కాకుండా పిరమల్ ఎంటర్ ప్రైసెస్‌ లో ఆర్ధిక సేవల విభాగంలో ఆమె చేరనున్నారని వార్తలు వచ్చాయి. కానీ అరుంధతీ భట్టాచార్య మాత్రం రిలయన్స్ ఆఫర్‌ వైపే మొగ్గు చూపారు.
సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీల్లో మాజీ బ్యాంకర్లు, బ్యూరోక్రాట్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని కార్పోరేట్ నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇతర కంపెనీల్లో టాప్ పొజీషన్లలో పని చేసిన వారికి రిలయన్స్ వంటి పెద్ద కంపెనీల్లో తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అని వారంటున్నారు.


5 ఏళ్ళపాటు రిలయన్స్ బోర్డ్‌లో కొనసాగనున్న అరుంధతీ భట్టాచార్య తన పనితీరుతో ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలనే సాధిస్తారని ఆమెతో పనిచేసిన మాజీ సహచరులు అభిప్రాయ పడుతున్నారు.Most Popular