నష్టాల వారాంతం- ఎఫ్‌ఎంసీజీ ఎదురీత!

నష్టాల వారాంతం- ఎఫ్‌ఎంసీజీ ఎదురీత!

దేశీ స్టాక్‌ మార్కెట్లలో బుధవారం చివర్లో ఊంపదుకున్న అమ్మకాలు నేడు కూడా కొనసాగాయి. ప్రపంచ మార్కెట్ల బలహీనతల కారణంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో దాదాపు 500 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ రోజంతా నేలచూపులతోనే కదిలింది. మిడ్‌సెషన్‌ నుంచీ మరోసారి ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనుకావడంతో మార్కెట్లు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్‌ 630 పాయింట్లు పడిపోయింది. చివరికి 464 పాయింట్ల నష్టాన్ని మిగుల్చుకుంది. 34,316 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం  150 పాయింట్లు కోల్పోయి 10,303 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలన్నీ డీలాపడగా.. ఎఫ్‌ఎంసీజీ మాత్రం 0.8 శాతం పుంజుకుంది.

ఐటీ పతనం
ఐటీ రంగం అత్యధికంగా 3.2 శాతం దిగజారగా.. మీడియా, ఆటో, రియల్టీ 2-0.75 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 16.5 శాతం కుప్పకూలగా.. హెచ్‌సీఎల్‌ టెక్‌, యస్‌బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌,  హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, హీరోమోటో, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ 6.5-3 శాతం మధ్య పతనమయ్యాయి. మరోపక్క హెచ్‌పీసీఎల్‌ 4 శాతం జంప్‌చేయగా.. సన్‌ ఫార్మా, వేదాంతా, కొటక్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, యూపీఎల్‌ 2.6-1 శాతం మధ్య బలపడ్డాయి. 

Image result for stock investor indian

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు నమోదయ్యాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1712 నష్టాలతో నిలవగా.. 879 మాత్రమే లాభపడ్డాయి.

దేశీ ఫండ్స్‌ అండ
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 140 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 343 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. గురువారం విజయ దశమి పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా..  సోమ, మంగళవారాల్లో ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1234 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా... దేశీ ఫండ్స్‌ రూ. 1355 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.Most Popular