ఎంఫసిస్‌ డీలా- అదానీ ఎంటర్‌ అప్‌!

ఎంఫసిస్‌ డీలా- అదానీ ఎంటర్‌ అప్‌!

మార్కెట్లు పతన బాటలో సాగుతున్న నేపథ్యంలో ఓవైపు ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎంఫసిస్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకోగా.. మరోపక్క వరుసగా ఐదో రోజు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ2లో ఎంఫసిస్‌ పటిష్ట ఫలితాలు సాధించింది. వివరాలు చూద్దాం...

ఎంఫసిస్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ఎంఫసిస్‌ లిమిటెడ్‌ నికర లాభం 37 శాతం ఎగసి రూ. 271 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 20 శాతం పెరిగి రూ. 1962 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం 9.5 శాతం పెరిగి రూ. 189 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 886 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎంఫసిస్‌ షేరు 5 శాతం పతనమై రూ. 1068 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1120 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లకు 52.34 శాతం వాటా ఉంది.

Image result for adani enterprises  ltd

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 
గత ఐదు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 169 వద్ద ట్రేడవుతోంది. దీంతో ఐదు రోజుల్లో ఈ కౌంటర్‌ 21 శాతం లాభపడినట్లయ్యింది. కాగా.. ఫ్రెంచ్‌ కెమికల్స్‌ దిగ్గజం టోటల్‌ ఎస్‌ఏతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా దేశీయంగా ఎల్‌ఎన్‌జీ దిగుమతి టెర్మినల్స్‌ నిర్మించడంతోపాటు.. ఇంధన రిటైలింగ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. టోటల్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా అదానీ.. రీగ్యాసిఫికేషన్‌ టెర్మినల్స్‌ ఏర్పాటు చేయనుంది.Most Popular