డిష్‌ టీవీకు జియో షాక్‌..!

డిష్‌ టీవీకు జియో షాక్‌..!

హాథవే కేబుల్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌ కంపెనీలలో నియంత్రిత వాటాల కొనుగోలుకి ముకేశ్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సన్నాహాలు చేయడంతో డిష్‌ టీవీ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8 శాతం పతనమైంది. రూ. 47 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 46 దిగువన 4 ఏళ్ల కనిష్టాన్ని తాకింది. 2014 మే తరువాత ఇది కనిష్ట స్థాయికాగా.. గత ఐదు సెషన్లుగా అమ్మకాల బారినడుతున్న ఈ కౌంటర్‌ 10 శాతం నష్టపోయింది! 

Image result for reliance jio

పోటీ తీవ్రతరం
రిలయన్స్ జియో ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ హాథవే కేబుల్‌లో 51.34 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2940 కోట్లను వెచ్చించనుంది. ఇక డెన్‌ నెట్‌వర్క్స్‌లోనూ 66 శాతం వాటాను కొనుగోలుకి రూ. 2045 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇది మల్టిపుల్‌ సిస్టమ్‌ ఆపరేటర్‌(ఎంఎస్‌వో) విభాగంలో ఇతర బ్రాడ్‌క్యాస్టింగ్‌, డీటీహెచ్‌ సంస్థలకు ప్రతికూలంగా పరిణమించే అవకాశమున్నట్లు ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో డిష్‌ టీవీ కౌంటర్‌లో అమ్మకాలు పెరిగి షేరు బలహీనపడినట్లు నిపుణులు తెలియజేశారు. ఇక మరోవైపు బీవోఏఎంఎల్‌ సైతం డిష్‌ టీవీ సబ్‌స్ర్కైబర్ల నుంచి ఒత్తిడి ఎదుర్కోవచ్చని పేర్కొంది. సగటు వినియోదారుడిపై ఆదాయం(ఏఆర్‌పీయూ) మందగించే వీలున్నదని అంచనా వేసింది.Most Popular