లాభాల కోసం ఆ నాలుగు...

లాభాల కోసం ఆ నాలుగు...

ఈ మధ్య IL&FS సంక్షోభం, NBFC కంపెనీల పతనం లాంటివి చూసి సాధారణ మదుపర్లు తమ పొదుపు చర్యలను చాలా వరకూ తగ్గించుకున్నారు. వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టడం క్షేమకరం అని మదుపర్లు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు సురక్షితం కావనే అభిప్రాయానికి వారొచ్చేసారు. అంతర్జాతీయ ఈక్వీటీ షేర్లు సాఫీగా సాగిపోతుండగా.. ఎమర్జింగ్ మార్కెట్ అయిన భారత్‌లో మాత్రం ఇన్వెస్టర్లు భారీ నష్టాలనే చవి చూస్తున్నారు. ఒక రకంగా దేశీయ పొదుపు రంగంలో స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్లు లాభదాయకం కాదు అనే అపోహ పెరిగిపోతుంది. ఈ విషయంలో స్టాక్ మార్కెట్లలో రెండేళ్ళ దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్లలో ఓ నాలుగు కంపెనీలను లాభాసాటిగా పేర్కొంటున్నారు ప్రముఖ స్టాక్ ఎనలిస్ట్... , LKP సెక్యూరిటీస్ హెడ్ ఎనలిస్ట్ S. రంగనాథ్. వారి మాటల్లోనే ఆ స్టాక్స్ ఎంటో చూద్దామా..!


అశోక్ లేల్యాండ్
ఈ మధ్య ఈ కంపెనీ మీద నెగిటివ్ టాక్ రావడంతో ఆ కంపెనీ షేర్లు కాస్త దిగివచ్చాయి. ఇది చిన్న మదుపర్లకు , రిటైల్ ఇన్వెస్టర్లకు కలిసి వచ్చే పరిణామం.ప్రస్తుతం భారీ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న అశోక్ లేల్యాండ్ చేతిలో రక్షణ వాహనాల తయారీ ఆర్డర్స్ ఉండటం కూడా కలిసొచ్చేదే. 2019లో దేశీయంగా ఎలక్షన్స్ జరగనుండటంతో.. కంపెనీ అమ్మకాలు జోరందుకోవచ్చు. ఇక 2020 సంవత్సరానికల్లా BS-6 అమలు కూడా అశోకా లేల్యాండ్‌కు లాభాసాటిగా మారొచ్చు.  ఈ కంపెనీ షేర్లు రెండేళ్ళపాటు హోల్డ్ చేయగలిగితే లాభాలను చవి చూడొచ్చు. భారీ వాహనాలను తయారు చేయడానికి అశోక్ లేల్యాండ్ సన్నాహకాలు చేయడం కూడా  కంపెనీ మార్కెట్ వాల్యూ పెరగడానికి దోహద పడొచ్చు.


గుజరాత్ ఆల్కలైన్ & కెమికల్స్
విదేశాల్లో ఉన్న ఈ కంపెనీ ప్లాంట్ల మూసివేతతో ఇక్కడ ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోనుండటంతో డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది.  విదేశీ ప్లాంట్ మూసివేత కారణంగా తన ఉత్పత్తి అయిన క్లోర్ ఆల్కలీ విషయంలో దాదాపు 15 శాతం మార్కెట్ వాటాను గుజరాత్ అల్కలైస్ దక్కించుకోనుంది.  కంపెనీలో నగదు ప్రవాహం, బలమైన బ్యాలెన్స్ షీట్ మేయిన్‌టైనింగ్.. వల్ల తన డౌన్ స్ట్రీమ్ ఉత్పత్తులైన క్లోరో మెథనాస్, హైడ్రోజన్ పెరాక్సైడ్ లను భారీ ఎత్తున తయారీకి మార్గం సుగమమైనట్టే. దాంతో ఈ కంపెనీ మీద కూడా రానున్న రెండేళ్ళ పాటు పెట్టుబడులు పెట్టొచ్చు.


కోకుయో కామ్లిన్
రు. 20,000 కోట్ల మార్కెట్ వాటా కలిగిన భారతీయ స్టేషనరీ మార్కెట్ లో ఇప్పడు కోకుయో కామ్లిన్ ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈ మధ్యనే మేనేజ్ మెంట్ మారడం, కంపెనీలో పెట్టుబడులు 40 శాతం పెరగడం కూడా క్యామ్లిన్ కంపెనీ వృద్ధికి దోహద పడనుంది. క్యామ్లిన్ కంపెనీ మాతృసంస్థ అయిన జపాన్‌కు చెందిన కోకుయో విస్తారంగా నిధులను క్యామ్లిన్ కు సరఫరా చేయనుంది.  అంతేకాకుండా స్టేషనరీ, ఆఫీస్ ప్రోడక్ట్స్, విద్యార్ధులకు అవసరమయ్యే వస్తువుల రంగంలో కోకుయో క్యామ్లిన్‌ ఆపార అనుభవం గడించింది. ఇప్పుడున్న జీఎస్టీ విధానం కూడా క్యామ్లిన్‌కు కలిసి వచ్చే అంశమే. కాబట్టి ఈ కంపెనీలో కూడా పెట్టుబడులు లాభసాటిగా మారొచ్చు.


సెలాన్ ఎక్స్‌ప్లోరేషన్
ఈ స్మాల్ క్యాప్ ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి దారు ఇప్పుడు చమురు క్షేత్రాలలో ఆర్ధిక వ్యవస్థను రాంప్ అప్ చేస్తుంది. అత్యంత చవకైన ధరలతో తన అమ్మకాలను గణనీయంగా పెంచుకుంటుంది సెలాన్ ఎక్స్‌ప్లోరేషన్ . అలాగే ఈ కంపెనీకున్న పెద్ద ఎసెట్ ఎంటంటే.. రుణ రహిత బ్యాలెన్స్ షీట్‌ను కలిగి ఉండటమే. రుణాలే లేని అతి తక్కువ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. దాంతో రానున్న రెండేళ్ళల్లో ఈ కంపెనీలో పెట్టుబడులు కూడా రెట్టింపు లాభాలను ఇవ్వొచ్చు.

 Most Popular