మహీంద్రా సీఐఈ, లక్ష్మీ మెషీన్‌ జోరు

మహీంద్రా సీఐఈ, లక్ష్మీ మెషీన్‌ జోరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఆటో విడిభాగాల సంస్థ మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. కాగా.. మరోపక్క సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) వార్తలతో ఇంజినీరింగ్‌ దిగ్గజం లక్ష్మీ మెషిన్‌ వర్క్స్‌ కౌంటర్‌ సైతం లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం.. 

మహీంద్రా సీఐఈ ఆటో
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌ నికర లాభం 74 శాతం జంప్‌చేసి రూ. 42.5 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం పెరిగి రూ. 657 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం పెరిగి రూ. 263 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 272 వరకూ ఎగసింది. ప్రమోటర్లకు కంపెనీలో 67.76 శాతం వాటా ఉంది.

Image result for lakshmi machine works limited

లక్ష్మీ మెషిన్‌ వర్క్స్‌
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడంతో లక్ష్మీ మెషీన్‌ వర్క్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.35 శాతం బలపడి రూ. 5951 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 6280 వద్ద గరిష్టాన్నీ, రూ. 5940 వద్ద కనిష్టాన్నీ తాకింది. కాగా.. ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదన అంశాన్ని పరిశీలించేందుకు బోర్డు ఈ నెల 22న సమావేశంకానున్నట్లు లక్ష్మీ మెషీన్‌ వర్క్స్‌ పేర్కొంది. Most Popular