నష్టాలలో- బ్యాంక్స్‌, ఆటో, రియల్టీ డౌన్‌

నష్టాలలో- బ్యాంక్స్‌, ఆటో, రియల్టీ డౌన్‌

ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 28 పాయింట్లు క్షీణించి 35,134కు చేరగా.. నిఫ్టీ 32 పాయింట్లు తిరోగమించి 10,553ను తాకింది. వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దూకుడు చూపిన మార్కెట్లు అమ్మకాలు తలెత్తడంతో ప్రస్తుతం తోక ముడిచాయి. కాగా.. మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు హైజంప్‌ చేయడంతో సెన్సెక్స్‌ తొలుత 250 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 10,710 వరకూ జంప్‌చేసింది. 

ఐబీ హౌసింగ్‌ పతనం
ఎన్‌ఎస్ఈలో ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాలు 1 శాతం స్థాయిలో పుంజుకోగా..  పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో, రియల్టీ 2 శాతం స్థాయిలో క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 9 శాతం కుప్పకూలగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, యస్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌, ఐషర్‌, ఓఎన్‌జీసీ, మారుతీ, ఎంఅండ్‌ఎం 5-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోపక్క హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌యూఎల్‌, కోల్‌ ఇండియా, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.6-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. 

Image result for realty

ఎన్‌బీఎఫ్‌సీలు డౌన్‌
డెరివేటివ్‌ స్టాక్స్‌లో నిట్‌ టెక్‌, యూబీఎల్‌, మెక్‌డోవెల్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్‌, బయొకాన్‌ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. దివాన్‌ హౌసింగ్‌, రెప్కో హోమ్‌, పిరమల్‌, ఎన్‌సీసీ, హెచ్‌సీసీ, శ్రేఈ ఇన్‌ఫ్రా, డిష్‌ టీవీ 9-5.3 శాతం మధ్య కుప్పకూలాయి. రియల్టీ షేర్లలో ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌, సన్‌టెక్‌, బ్రిగేడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 6.4-1.6 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నప్పటికీ చిన్న షేర్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.2 శాతం స్థాయిలో నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1679 నష్టపోగా.. 788 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.Most Popular