భారీగా పతనమైన ఇండియా బుల్స్ ...

భారీగా పతనమైన ఇండియా బుల్స్ ...

ముంబైకి చెందిన ఇండియా బుల్స్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు  13.26 శాతం క్షీణతను చవిచూశాయి. సెప్టెంబర్ 25 నుండి క్రమం తప్పకుండా కంపెనీ 20 రోజుల సగటున ట్రేడింగ్ వాల్యూమ్ మూడు సార్లు పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కంపెనీకి చెందిన దాదపు 95 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇప్పటికే NBFC కంపెనీలు వరుస పతనాలతో సతమతమౌతున్న నేపధ్యంలో ఇండియా బుల్స్ ఫైనాన్స్ కంపెనీ కూడా మరో IL&FS ను తలపిస్తుందా అని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కుప్పకూలే దశలో ఉన్నాయి. దీర్ఘకాలిక రుణాలివ్వడం, స్వల్పకాలిక రుణాలు తెచ్చుకోవడమే ఈ NBFCల పతనానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మార్కెట్లలో ద్రవ్య లభ్యత తగ్గిపోడం కూడా NBFCల మనీ రొటేటింగ్ ప్రక్రియకు ప్రధాన అవరోధంగా నిలిచింది. కాగా నేటి బుధవారం మార్కెట్లో ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ రు. 81.90 పైసలు తగ్గి రు.826.55 వద్ద ట్రేడ్ అవుతోంది.Most Popular