ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు అమ్మకాల సెగ!

ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు అమ్మకాల సెగ!

ఎన్‌బీఎఫ్‌సీల రుణ పోర్ట్‌ఫోలియోలను కొనుగోలు చేసేందుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆసక్తి చూపుతున్నట్లు వెలువడ్డ వార్తలతో గత కొద్ది రోజులుగా జోరందుకున్న ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లు తిరిగి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. పలు ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు విభిన్న ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. పలు కౌంటర్లలో అమ్మకాలు పెరగడంతో నేలచూపులతో కదులుతున్నాయి. వివరాలు చూద్దాం..
 
పతన బాటలో
ఫైనాన్షియల్‌ రంగంలో తిరిగి నేలచూపులకు చేరిన కౌంటర్ల జాబితా ఇలా ఉంది.  ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐబీ హౌసింగ్‌ దాదాపు 9 శాతం కుప్పకూలి రూ. 828కు చేరింది. ఇంట్రాడేలో కనిష్టంగా రూ. 787ను తాకింది. దివాన్‌ హౌసింగ్‌ దాదాపు 9 శాతం పతనమై రూ. 246 వద్ద(రూ.238 వద్ద ఇంట్రాడే కనిష్టం), కేన్‌ఫిన్‌ హోమ్‌ 4 శాతం తిరోగమించి రూ. 232 వద్ద(రూ. 229) ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా రెప్కో హోమ్‌ దాదాపు 7 శాతం క్షీణించి రూ. 346కు చేరగా.. ఇంట్రాడేలో రూ. 324 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. బజాజ్‌ ఫైనాన్స్‌ 3.4 శాతం నష్టంతో రూ. 2234 వద్ద (ఇంట్రాడే కనిష్టం రూ. 2222), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.5 శాతం తిరోగమించి రూ. 5565 వద్ద(రూ. 5486), జీఐసీ హౌసింగ్‌ 3.2 శాతం నష్టంతో రూ. 229 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో చోళమండలం 2.6 శాతం తిరోగమించి రూ. 1178ను(రూ. 1162)ను తాకింది. ఇక ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ మరోసారి 5 శాతం పతనంకావడం గమనార్హం! ఈ షేరు రూ. 433 దిగువన ఫ్రీజయ్యింది. 

Image result for stock brokers india
 
నష్టాలతో కుదేల్‌
ఫైనాన్షియల్‌ సేవలు అందిస్తున్న ఇతర కౌంటర్లలో ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ 3 శాతం పతనమై రూ. 241ను తాకాగా. కేపిటల్‌ ఫస్ట్‌ 2 శాతం క్షీణించి రూ. 481కు చేరింది. రిలయన్స్‌ కేపిటల్‌ 5 శాతం పడిపోయి రూ. 255 వద్ద ట్రేడవుతోంది. ఎంఅండ్ఎం ఫైనాన్స్‌ దాదాపు 3 శాతం వెనకడుగుతో రూ. 387 వద్ద, మ్యాగ్మా ఫిన్‌ కార్ప్‌ 3.4 శాతం తిరోగమించి రూ. 105 వద్ద, సెంట్రమ్‌ కేపిటల్‌ 5 శాతం పతనమై రూ. 42 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా మణప్పురం ఫైనాన్స్‌ 2 శాతం నీరసించి రూ. 73వద్ద, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ 3.5 శాతం పతనమై రూ. 127వద్ద, శ్రేఈ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ 4 శాతం వెనకడుగుతో రూ. 32 వద్ద కదులుతున్నాయి.    Most Popular