బ్లూచిప్స్‌ దన్ను- అమెరికా హైజంప్‌

బ్లూచిప్స్‌ దన్ను- అమెరికా హైజంప్‌

కార్పొరేట్‌ ఫలితాలు ప్రోత్సాహాన్నివ్వడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. మంగళవారం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్‌ ముగిసేసరికి డోజోన్స్‌ 548  పాయింట్లు(2.2 శాతం) జంప్‌చేసి 25,798 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 59 పాయింట్లు(2.15 శాతం) దూసుకెళ్లి 2,810 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 215 పాయింట్లు(0.9 శాతం) పురోగమించి 7,465 వద్ద స్థిరపడింది. దీంతో ఈ ఏడాది మార్చి తరువాత మళ్లీ యూఎస్‌ మార్కెట్లు భారీ ర్యాలీ చేశాయి. బ్లూచిప్‌ దిగ్గజాలు యునైటెడ్‌ హెల్త్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో సెంటిమెంటుకు బూస్ట్‌ లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా ముందురోజు డీలాపడిన టెక్నాలజీ దిగ్గజాలు జోరందుకోవడం కూడా మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. 

Image result for adobe systems

మోర్గాన్‌ స్టాన్లీ జోరు
ప్రధానంగా టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ ఇండెక్సులు 3 శాతం చొప్పున జంప్‌చేశాయి. త్రైమాసిక ఫలితాలు ఆకట్టుకోవడంతో మోర్గాన్‌ స్టాన్లీ 6 శాతం, యునైటెడ్ హెల్త్‌ 5 శాతం, గోల్డ్‌మన్‌ శాక్స్‌ 3 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో వాల్‌మార్ట్ 2 శాతం, జాన్సన్‌ అండ్ జాన్సన్‌ 2 శాతం చొప్పున బలపడ్డాయి. ఎడోబ్‌ సిస్టమ్స్‌ దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. అయితే మరోవైపు ఈక్విటీ, బాండ్లు, తదితర దీర్ఘకాలికి విక్రయాలు మందగించినట్లు వెల్లడించడంతో బ్లాక్‌రాక్‌ 4.5 శాతం పతనమైంది. ఇదే విధంగా ఫలితాలు నిరుత్సాహపరచడంతో డబ్ల్యూడబ్ల్యూ గ్రాయింగర్‌ 12 శాతం కుప్పకూలింది. 

Image result for morgan stanley

ఫ్యాంగ్‌ స్టాక్స్‌ అప్‌
త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో ఫ్యాంగ్‌(FAANG) స్టాక్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌ 12 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో అల్ఫాబెట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ సైతం 1 శాతం చొప్పున బలపడ్డాయి.  

ఆసియా ప్లస్‌లో
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ కొనుగోళ్లదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో ఆసియాలో సింగపూర్‌, జపాన్‌, కొరియా, ఇండొనేసియా, థాయ్‌లాండ్ 1.4-0.5 శాతం మధ్య ఎగశాయి. మిగిలిన మార్కెట్లలో చైనా 0.15 శాతం లాభపడగా..  తైవాన్‌ మాత్రమే(నామమాత్ర) నష్టంతో కదులుతోంది. హాంకాంగ్‌ మార్కెట్‌కు సెలవు.Most Popular