ట్రైడెంట్‌, నెట్‌వర్క్‌18 -ఫలితాలు భేష్‌

ట్రైడెంట్‌, నెట్‌వర్క్‌18 -ఫలితాలు భేష్‌

ఈ ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించించడంతో హోమ్‌ టెక్స్‌టైల్స్‌ సంస్థ ట్రైడెంట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌తోపాటు.. మీడియా సంస్థ నెట్‌వర్క్‌18 షేరు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

ట్రైడెంట్‌ లిమిటెడ్‌ 
హోమ్‌ టెక్స్‌టైల్స్‌ సంస్థ ట్రైడెంట్‌ లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 16 శాతం దూసుకెళ్లింది. రూ. 67 వద్ద ట్రేడవుతోంది. 
ఫలితాలు గుడ్‌
క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ట్రైడెంట్‌ లిమిటెడ్‌ నికర లాభం 51 శాతం దూసుకెళ్లి రూ. 109 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 24 శాతం పెరిగి రూ. 1391 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) మరింత అధికంగా 50 శాతం జంప్‌చేసి రూ. 261 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 15.5 శాతం నుంచి 18.8 శాతానికి ఎగశాయి. 

Image result for network18 media and investments ltd

నెట్‌వర్క్‌18 జోరు
క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నెట్‌వర్క్‌18 మీడియా &ఇన్వెస్ట్‌మెంట్స్‌ నికర నష్టాలు తగ్గాయి. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర నష్టం రూ. 113 కోట్ల నుంచి రూ. 68 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం పెరిగి రూ. 1237 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) మరింత అధికంగా 400 శాతం జంప్‌చేసి రూ. 92 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 1.6 శాతం నుంచి 7.4 శాతానికి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 46 వద్ద ట్రేడవుతోంది. Most Popular