యూరప్‌, ఆసియా మార్కెట్లు డౌన్‌!

యూరప్‌, ఆసియా మార్కెట్లు డౌన్‌!

బ్రెక్సిట్‌ చర్చలపై సందేహాలు... చైనా ఆర్థిక మందగమనం అంచనాలు యూరోపియన్‌, ఏషియన్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం యూరప్‌ మార్కెట్లలో ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏస, యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ సైతం 0.2 శాతం వెనకడుగులో ఉంది. ఇక ఆసియాలో సైతం థాయ్‌లాండ్‌ మార్కెట్‌కు సెలవుకాగా.. మిగిలిన అన్ని మార్కెట్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. జపాన్‌, చైనా, తైవాన్‌, హాంకాంగ్ 1.5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఈ బాటలో కొరియా, సింగపూర్‌, ఇండొనేసియా 0.8-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

Image result for european stock traders

బ్రెక్సిట్‌ భయాలతో
గత వారం ఉన్నట్టుండి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు భారీ అమ్మకాలతో కుదేలైన కారణంగా ట్రేడర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో అంతర్గతంగా సెంటిమెంటు బలహీనంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా.. గత వారాంతాన యూరోపియన్‌ యూనియన్‌తో బ్రెక్సిట్‌ అంశంపై యూకే నిర్వహించిన చర్చలు విఫలంకావడం కూడా ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

కాన్వాటెక్‌
కంపెనీ సీఈవో పాల్‌ మొరావీక్‌ను రాజీనామా చేయవలసిందిగా బోర్డు కోరినట్లు వెల్లడించడతంతో బ్రిటిష్‌ మెడికల్‌ ప్రొడక్టుల సంస్థ కాన్వాటెక్‌ 30 శాతంపైగా కుప్పకూలింది. దీనికితోడు పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను(గైడెన్స్‌) తగ్గించడం కూడా ఈ కౌంటర్లో భారీ అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. డెన్మార్క్‌ సంస్థ సీహెచ్‌ఆర్ హాన్సన్‌ నాలుగో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో 4 శాతం జంప్‌చేసింది. Most Popular