హిందుస్థాన్ యూనీ లివర్‌ను వెంటాడుతున్న GST నీడలు

హిందుస్థాన్ యూనీ లివర్‌ను వెంటాడుతున్న GST నీడలు

గత సెప్టెంబర్‌లో జీఎస్టీ రాయితీలను కస్టమర్లకు ఇవ్వకుండా లాభాలు గడించిందన్న ఆరోపణలపై HUL(హిందుస్థాన్ యూనీలివర్ లిమిటెడ్ )  కంపెనీపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సేఫ్ గార్డ్ విచారణ జరుపుతున్న సంగతి విదితమే. కాగా ఈ కేసులో ఇప్పటికే HUL  రు. 160 కోట్ల రుపాయిలను ప్రభుత్వానికి డిపాజిట్ చేసిందని, సేఫ్ గార్డ్స్ చేసిన ఆరోపణలపై తాము సవివరంగా రికార్డ్స్ సబ్మిట్ చేశామని HUL చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీనివాస్ పాఠక్ తెలిపారు. నవంబర్ లో GST తగ్గించిన ఉత్పత్తులపై ధరలను తగ్గించి కస్టమర్లకు అమ్మలేదని... అదే పాత రేట్లతో రు. 400 కోట్ల లాభాలను హిందుస్థాన్ యూనీలివర్ దక్కించుకుందని కన్జ్యూమర్ ఫోరం ఆరోపిస్తుంది. తమ కంపెనీ గవర్నమెంట్ యొక్క నియమనిబంధనలను పాటిస్తుందని, స్టాండర్డ్ ఇండస్ట్రీ ప్రాక్టీస్ కు లోబడే వ్యాపారం చేస్తున్నామని పాఠక్ పేర్కొన్నారు. సేఫ్ గార్డ్ కమిటీకి తాము ఇచ్చిన వివరణలు వారిని కన్విన్స్ చేస్తాయనే ఆశాభావాన్ని హిందుస్థాన్ యూనీ లివర్ వ్యక్తం చేసింది.

3.39శాతం నష్టపోయిన HUL షేర్ వాల్యూ

కాగా కస్టమర్లకు జీఎస్టీ లాభాలను పంచలేదని , వారికి దక్కాల్సిన రాయితీలను కంపెనీ లాభాల్లో జమ చేసుకుందన్న ఈ ఆరోపణలు గనుక రుజువైతే.. హిందుస్థాన్ యూనీలివర్ పై పెను ప్రభావం ఉండొచ్చు. ఎకంగా కంపెనీ లైసెన్స్ కూడా రద్దు కావొచ్చని బిజినెస్ లీగల్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కాగా HUL ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రెస్ మీట్ ముగియగానే HUL షేర్ ధర 3.39 శాతం నష్టపోయి  రు. 1516.40 వద్ద ట్రేడ్ అయింది.Most Popular