నాట్కో ఫార్మా ధగధగలు..

నాట్కో ఫార్మా ధగధగలు..

కోపాక్జోన్ మెడిసిన్ మీద పేటెంట్ హక్కుల కాల వ్యవధి అయిపోయిందని US  కోర్ట్ తీర్పునివ్వడంతో .. అదే మెడిసిన్ తయారు చేసే నాట్కో ఫార్మాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఆ కంపెనీ షేర్ వాల్యూ 6.74 శాతం పెరిగి రు. 725 వద్ద నమోదు అయింది. గత రెండేళ్ళ ప్రాఫిట్ ఎర్నింగ్స్ తో పోలిస్తే.. నాట్కో స్టాక్ 16.2 రెట్లు ఎక్కువగా ట్రేడ్ అయిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అమెరికన్ కోర్ట్ కోపాగ్జిన్ 40 mg, డోసింగ్ పేటెంట్లు ఇన్ వాలీడ్ అంటూ ప్రకటించడంతో.. నాట్ కో ఫార్మా మార్కెటింగ్ పార్టనర్‌ అయిన మిలన్ ఫార్మా విజయం సాధించినట్టైంది. ఈ మెడిసిన్ తయారీలో ఉన్న అవరోధాలు తొలగిపోడంతో నాట్ కో ఫార్మా షేర్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. పేటెంట్ ట్రైల్ ఎండ్ అప్పీల్ బోర్డ్ (PTAB) గత పేటెంట్ వివాదాలను కొట్టివేయడంతో మిలన్ , నాట్ కో ఫార్మాలకు మార్గం సుగమమైంది.Most Popular