సీఈఎస్‌సీ, ఇన్ఫో ఎడ్జ్‌ అప్‌

సీఈఎస్‌సీ, ఇన్ఫో ఎడ్జ్‌ అప్‌

నష్టాల మార్కెట్లోనూ ఓవైపు డైవర్సిఫైడ్‌ సంస్థ సీఈఎస్‌సీ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకోగా.. మరోపక్క ఇన్ఫో ఎడ్జ్‌ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రణాళికలు వేసిన బిజినెస్‌ల విడదీత(డీమెర్జర్‌) వార్తలు సీఈఎస్‌సీ కౌంటర్‌కు జోష్‌నివ్వగా.. జొమాటోలో వాటా విక్రయ వార్తలు ఇన్ఫో ఎడ్జ్‌కు డిమాండ్‌ పెంచాయి. వివరాలు చూద్దాం..

సీఈఎస్‌సీ
బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీసేందుకు గతంలో ప్రకటించిన ప్రణాళికలను అమలు  చేయనున్నట్లు తాజాగా సీఈఎస్‌సీ ప్రకటించింది. అయితే నాలుగు కంపెనీలుగా కాకుండా మూడింటికే పరిమితం చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సీఈఎస్‌సీ షేరు 2.3 శాతం బలపడి రూ. 921 వద్ద ట్రేడవుతోంది. తొలుత 5 శాతం జంప్‌చేసి రూ. 948కు చేరింది.
డీమెర్జర్‌ ఇలా
విద్యుత్‌ ప్రసారం, పంపిణీ బిజినెస్‌ను మాతృసంస్థలోనే కొనసాగించనున్నటట్లు సీఈఎస్‌సీ పేర్కొంది. సీఈఎస్‌సీలో 10 షేర్లు కలిగిన వాటాదారులు రిటైల్‌ బిజినెస్‌కు చెందిన 6 షేర్లు, ఇతర వెంచర్‌లో 2 షేర్లు చొప్పున పొందనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రికార్డ్‌ డేట్‌ అక్టోబర్‌ 31గా కంపెనీ ప్రకటించింది. 

Related image

ఇన్ఫో ఎడ్జ్‌ 
జొమాటోలో వాటాను 30.91 శాతం నుంచి 27.68 శాతానికి తగ్గించుకున్నట్లు ఇన్ఫో ఎడ్జ్‌ తాజాగా తెలియజేసింది. అలీపే సింగపూర్‌(అలీబాబా గ్రూప్‌)తో 21 కోట్ల డాలర్ల పెట్టుబడుల కోసం జొమాటో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో సుమారు 3 శాతం వాటా విక్రయాన్ని చేపట్టినట్లు వెల్లడించింది. ఇప్పటికే జొమాటోలో అలీబాబా గ్రూప్‌ ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగాMost Popular