పేటీఎం వెలుగులు ...

పేటీఎం వెలుగులు ...

భారత దేశంలో నగదు రహిత చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న పేటీఎం ఇప్పుడు తన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువను రెండింతలుగా పెంచుకుంది. తాజాగా పేటీఎంలో వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్ షైర్ రు. రెండు వేల కోట్ల పెట్టుబడిని పెట్టడంతో కంపెనీ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది.  కాగా తన ఇన్వెస్టర్లకు ఇంట్రెస్ట్ రేట్‌ను కూడా పేటీఎం పెంచింది. ఇందుకు గాను తగిన కార్యచరణను రూపొందించడానికి తన ప్రధాన ఇన్వెస్టర్లు, షేర్ హోల్డర్స్, ఉద్యోగులతో చర్చలు జరపుతున్నట్టు సమాచారం. బెర్క్ షైర్ హాత్‌వే పెట్టుబడుల కారణంగా పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా హై వాల్యూలోకి పెరిగింది.
వాల్యూ రైజింగ్...
జూన్ 2016లో పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్  వాల్యూ 2.3 బిలియన్ డాలర్లుగా ఉండేది.  అదే సెప్టెంబర్ 2016 కల్లా కంపెనీ వాల్యూ 4.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. తరువాతి సంవత్సరం మే 2017 నాటికి 7 బిలియన్ డాలర్లకు వాల్యూ పెరిగింది. 2018 జనవరి లో 10 బిలియన్ డాలర్లకు, ఆగస్ట్ 2018 నాటికి 16 బిలియన్ డాలర్లకు పెరిగింది. Most Popular