వాహన రంగంలో దూసుకెళ్తున్న టాటా మోటార్స్...

వాహన రంగంలో దూసుకెళ్తున్న టాటా మోటార్స్...

దేశీయ డొమెస్టిక్ పర్పస్ వెహికిల్స్ రంగంలో టాటా మోటర్స్ శరవేగంగా విస్తరిస్తుంది. 2019 ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసికంలోనే దాదాపు 37 శాతం వృధ్ధిని కనబరిచింది టాటా మోటార్స్. జపాన్ కార్ల కంపెనీ హోండాను అధిగమించి దేశంలోనే నాలుగో అతిపెద్ద కార్ల తయారీ కేంద్రంగా టాటా మోటర్స్ ఎదిగింది. 2018 ఆర్ధిక సంవత్సరంలో మహీంద్ర & మహీంద్రా(M&M)  1,21,849 యూనిట్లు అమ్మగా అదే సంవత్సరం టాటా మోటర్స్ 81,477 యూనిట్ల అమ్మకాలే జరిపింది. కానీ.. ఈ 2019 ఆర్ధిక సంవత్సర తొలి భాగంలోనే M&M అమ్మకాలు గతంలో కంటే 0.09 శాతం తక్కువగా 1,21,729 యూనిట్ల అమ్మకాలు జరపగా , టాటా మోటర్స్ మాత్రం ఏకంగా 31.2 శాతం అభివృద్ధితో 1,06,865 యూనిట్ల అమ్మకాలు జరిపి హోండా కంపెనీని వెనక్కి నెట్టింది. డొమెస్టిక్ పర్పస్ వెహికిల్స్ విభాగంలో M&M పనితీరు మందగించడంతో రానున్న కొద్ది నెలల్లో టాటా మోటార్స్ దేశంలోనే మూడో అతిపెద్ద PV తయారీ కేంద్రంగా ఎదుగుతుందని టాటా మోటర్స్ పర్పస్ వెహికిల్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరేఖ్ అంటున్నారు. గత కొద్దినెలలుగా వాహన రంగం అమ్మకాల్లో క్షీణత నమోదు చేసినప్పటికీ టాటా మోటర్స్ మాత్రం 32 శాతం వృద్ధిని కనబరిచింది. ఏదో ఒక రోజు మేము భారత దేశ నెంబర్ వన్ పర్పస్ వెహికల్ మ్యాన్యుఫాక్చర్స్ గా నిలుస్తామని మాయంక్ అంటున్నారు. ప్రస్తుతం దేశీయంగా కార్ల మార్కెట్లలో మొదటి స్థానంలో మారుతీ సుజికీ ఉండగా రెండో స్థానంలో హ్యుందాయ్ కంపెనీ ఉంది. మూడో స్థానంలో ఉన్న M&M ను అతి త్వరలోనే అధిగమిస్తామని టాటా మోటర్స్ అంటోంది.


డీలర్స్ ను రెట్టింపు చేయనున్న టాటా మోటర్స్ ...
ప్రస్తుతం టాటా మోటర్స్ PV ( పర్పస్ వెహికిల్ ) విభాగంలో 750 డీలర్ షిప్స్ కలిగి ఉంది. ఈ సంఖ్యను 2020 కల్లా రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ తెలిపింది. డీలర్స్ వయబిలిటీ, మిగతా వారి కంటే ఎక్కువ లాభాలు పంచిపెట్టడం అనే రెండు అంశాల మీదే టాటా మోటర్స్ విజయం ఆధార పడి ఉందని కంపెనీ ప్రెసిడెంట్ పరేఖ్ అంటున్నారు. డీలర్స్ కు ఎక్కువ లాభాలు వచ్చేలా, కస్టమర్లకు సర్వీసింగ్ కేంద్రాలు మరిన్ని ఎక్కువ ఉండేలా చేస్తూ.. ఈ ఆర్ధిక సంవత్సరంలో మరింత పురోభివృద్ధిని చూపుతామంటున్నారు టాటా మోటర్స్ ప్రతినిధులు.Most Popular