జోష్‌లో చమురు షేర్లు!

జోష్‌లో చమురు షేర్లు!

మార్కెట్లు పతన బాటలో సాగుతున్న నేపథ్యంలోనూ చమురు రంగ షేర్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దాదాపు ఇంధన రంగ షేర్లన్నీ లాభాలతో కళకళలాడుతున్నాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు, న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు బ్యారల్‌ ధరలు తాజాగా 1.5 శాతం చొప్పున క్షీణించడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్రెంట్‌ బ్యారల్‌ 82 డాలర్ల దిగువకు చేరగా.. నైమెక్స్‌ 72 డాలర్ల ఎగువన కదులుతోంది. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కోలుకోవడం కూడా దీనికి జత కలిసినట్లు తెలియజేశారు.

Image result for petrol pumps

జోరుగా హుషారుగా
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌పీసీఎల్‌ షేరు 11 శాతం దూసుకెళ్లి రూ. 201 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 216 వరకూ ఎగసింది. ఈ బాటలో ఐవోసీ 4.6 శాతం జంప్‌చేసి రూ. 130 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 134 వరకూ పెరిగింది. బీపీసీఎల్‌ సైతం 3.5 శాతం పెరిగి రూ. 275కు చేరింది. తొలుత ఒక దశలో గరిష్టంగా రూ. 284ను అధిగమించింది. ఇక ఓఎన్‌జీసీ దాదాపు 4 శాతం పుంజుకుని రూ. 154 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 160 వద్ద గరిష్టానికి చేరింది. ఈ ప్రభావంతో గెయిల్‌ 2.5 శాతం బలపడి రూ. 345 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 352ను తాకింది. ఇతర కౌంటర్లలో మంగళూర్‌ రిఫైనరీ 9 శాతం దూసుకెళ్లి రూ. 76.50 వద్ద ట్రేడవుతుంటే.. చెన్నై పెట్రోలియం 3 శాతం లాభంతో రూ. 246 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 255 వరకూ ఎగసింది.Most Popular