జీ లాభాల ఎంటర్‌టైన్‌మెంట్‌!

జీ లాభాల ఎంటర్‌టైన్‌మెంట్‌!

ఈ ఏడాది(2018-19) క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్‌ పతన మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.4 శాతం పెరిగి రూ. 475 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 479 వరకూ జంప్‌చేసింది. ఇదే విధంగా రూ. 435 దిగువన ఇంట్రాడే కనిష్టాన్నీ చవిచూసింది. 

ఫలితాలు ఓకే
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం 4 శాతం పెరిగి రూ. 377 కోట్లను తాకింది. అయితే కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 38 శాతం క్షీణించింది. రూ. 387 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 25 శాతం ఎగసి రూ. 1976 కోట్లకు చేరింది. ప్రకటనల ఆదాయం(కన్సాలిడేటెడ్‌) దాదాపు 23 శాతం పెరిగి రూ. 1211 కోట్లకు చేరింది. సబ్‌స్క్రిప్షన్‌ బిజినెస్‌ సైతం 21 శాతంపైగా పుంజుకుని రూ. 608 కోట్లను అధిగమించింది.  
సీఎల్‌ఎస్‌ఏ సిఫారసు
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరుకి ఇప్పటికే బయ్‌ రేటింగ్‌(కొనుగోలుకి సిఫారసు)ను ప్రకటించిన విదేశీ బ్రోకింగ్‌ హౌస్‌ సీఎల్‌ఎస్‌ఏ తాజాగా మరోసారి ఈ షేరుని రికమండ్‌ చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే గతంలో ఇచ్చిన టార్గెట్‌ ధర రూ. 675ను రూ. 670కు సవరించింది. క్యూ2 ఫలితాలు అంచనాలను మించినట్లు తెలియజేసింది. దేశీయంగా ప్రకటనల ఆదాయం వృద్ధికి దోహదపడుతున్నట్లు పేర్కొంది. కాగా.. మరో విదేశీ రీసెర్చ్‌ సంస్థ మెక్వారీ సైతం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఔట్‌ఫెర్ఫార్మ్‌ రేటింగ్‌ను ఇచ్చింది. షేరుకి రూ. 556 టార్గెట్‌ ధరను ప్రకటించింది.Most Popular