గూగుల్ ఆన్ లైన్ స్టోర్స్ లాంఛింగ్ సూన్

గూగుల్  ఆన్ లైన్ స్టోర్స్ లాంఛింగ్ సూన్

ఇప్పటి దాకా డైరెక్ట్ స్టోర్స్ తెరవని గూగుల్ ఇప్పుడు భారత దేశంలోని ఈ కామర్స్ మార్కెట్ మీద కన్నేసింది. రానున్న నవంబర్‌లో గూగుల్ ఆన్ లైన్ స్టోర్‌ను ప్లాన్ చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఆన్ లైన్ స్టోర్‌లో గూగుల్ ఉత్పత్తులైన స్మార్ట్ ఫోన్లు, లైసెన్స్‌డ్ సాఫ్ట్‌వేర్స్, బ్రాండెడ్ హార్డ్‌వేర్స్ వంటి వాటిని ఉంచుతామని గూగుల్ అంటోంది. ఈ ఆన్ లైన్ స్టోర్స్ లో  గూగుల్ పిక్సెల్ న్యూ బ్రాండ్ ఫోన్లు, క్రోమ్‌కాస్ట్ ఫోన్లు, గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్స్ , వర్చ్యువల్ రియాలిటీ హెడ్ సెట్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.


థర్డ్ పార్టీ పార్టనర్స్ కోసం వెతుకులాట...
ఈ ఆన్ లైన్ స్టోర్స్ నెలకొల్పడానికి థర్డ్ పార్టీ పార్టనర్స్‌ను వెతుకుతున్నామని గూగుల్ కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా యాపిల్ స్టోర్స్ మాదిరి గూగుల్ ఆన్ లైన్ స్టోర్లలో వినియోగ దారులకు నిబద్ధత గల సేవలందిస్తామని, వస్తువుల మీద వారెంటీ, గ్యారెంటీ విషయాల్లో అప్ డేట్స్ నేరుగా ఈ ఆన్ లైన్ స్టోర్లో చూడొచ్చని అంటోంది. 2017లో దేశీయంగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో గూగుల్ ఫోన్ల అమ్మకాలు కేవలం 0.07 శాతం మాత్రమే.  రు. 30,000 పైబడిన స్మార్ట్ ఫోన్ల విపణిలో గూగుల్ వాటా 3 శాతంగా ఉంది.  భారత్ వంటి వృద్ధి చెందుతున్న దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ కాబట్టి ఇక్కడా తమ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలను పెంచుకోవాలన్నది గూగుల్ అభిప్రాయం.

ఇందులో భాగంగానే ఆన్ లైన్ స్టోర్లను ప్రారంభించి ఎండ్ టు ఎండ్ అమ్మకాలను మొదలెట్టనుంది. కస్టమర్లకోసం   యాపిల్ సంస్థ యాపిల్ కేర్ ను ఎలా అయితే తీసుకొచ్చిందో.. గూగుల్ కూడా కస్టమర్ల సర్వీస్ కోసం ఈ ఆన్ లైన్ స్టోర్లో సదుపాయాలు కల్పించనుంది.
ఆన్ లైన్ ఫోన్ల అమ్మకాలే టార్గెట్....
ఆన్ లైన్ స్టోర్ల నిర్వహాణలో మెరుగైన పనితీరును కనబరుస్తున్న ఇన్ గ్రాం మైక్రో వంటి కంపెనీలతో బాటు పలు థర్డ్ పార్టీ వాటా దారులతో చర్చలు కొనసాగిస్తుంది గూగుల్. ఈ కామర్స్ రంగంలో అత్యధిక ఫోన్ల విక్రయాలు కలిగిఉన్న స్యామ్ సంగ్, గ్జియోమీలు ఇప్పటికే ఆన్ లైన్ వ్యాపారంలో దూసుకెళ్ళుతున్నాయి. వీటికి ధీటుగా గూగుల్ స్మార్ట్ ఫోన్లను ఆన్ లైన్‌లో విక్రయించాలన్నదే గూగుల్ లక్ష్యం. Most Popular