బంధన్‌ బ్యాంక్‌, దిలీప్‌ బిల్డ్‌ డీలా

బంధన్‌ బ్యాంక్‌, దిలీప్‌ బిల్డ్‌ డీలా

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రయివేట్‌ రంగ సంస్థ బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకోగా.. తాజాగా ఒడిషా నుంచి ప్రాజెక్టును గెలుపొందినట్లు వెల్లడించినప్పటికీ మౌలిక సదుపాయాల సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కౌంటర్‌ 52 వారాల కనిష్టాన్ని తాకింది. వివరాలు చూద్దాం...

బంధన్‌ బ్యాంక్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో బుధవారం 6 శాతం జంప్‌చేసి రూ. 512 వద్ద ముగిసిన బంధన్‌ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం అమ్మకాలతో డీలాపడింది. ఎన్‌ఎస్ఈలో 7.4 శాతం పతనమై రూ. 475 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 467 వరకూ జారింది. 
క్యూ2 గుడ్‌ 
క్యూ2లో బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం 47 శాతంపైగా ఎగసి రూ. 488 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 56 శాతం పెరిగి రూ. 1078 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.26 శాతం నుంచి 1.3 శాతానికి స్వల్పంగా పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.6 శాతం నుంచి 0.7 శాతానికి చేరాయి. 

Related image

దిలీప్‌ బిల్డ్‌కాన్‌
ఒడిషా నుంచి భారీ కాంట్రాక్టును పొందినట్లు వెల్లడించినప్పటికీ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కౌంటర్‌ అమ్మకాలతో నీరసించింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.5 శాతం క్షీణించి రూ. 529 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 539 వద్ద గరిష్టాన్నీ, రూ. 516 వద్ద కనిష్టాన్నీ తాకింది. మహానది కోల్‌ఫీల్డ్‌కు చెందిన మైనింగ్‌ ప్రాజెక్టులో ఓబీ రిమూవల్‌ కాంట్రాక్టును పొందినట్లు దిలీప్‌ బిల్డ్‌కాన్‌ తాజాగా పేర్కొంది. ఒడిషాలోని ఝార్సిగూడ జిల్లాలోని శ్యామలేశ్వరీ ఓసీపీలోగల మైనింగ్‌ ప్రాజెక్టు నుంచి లభించిన కాంట్రాక్టు విలువను రూ. 1,000 కోట్లుగా తెలియజేసింది. కాంట్రాక్టు గడువును 1825 రోజులుగా పేర్కొంది.Most Popular