52 వారాల కనిష్టానికి 175 స్టాక్స్!

52 వారాల కనిష్టానికి 175  స్టాక్స్!

బుధవారం నాటి మార్కెట్లు పుంజుకోడంతో మదుపర్లు నేటి మార్కెట్ మీద భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వారి కళ్ళల్లో రక్తపు టేరులను ప్రవహింపజేస్తూ... గురువారం మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. దాదాపు 175 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతీ ఎయిర్ టెల్, బాంబేడైయింగ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , దీపక్ ఫెర్టిలైజర్స్ , ఫినోలెక్స్, HAL, HUDCO, ఇండోస్టార్ నీల్ కమన్, లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి.
ఇక NBFC ల పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. నిన్న కాస్త పుంజుకున్న నాన్ బ్యాంకింగ్ కంపెనీలు నేడు
ఒక్కసారిగా నష్టపోయాయి. నిన్న NBFCల నుండి రుణ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్టు SBI ప్రకటనతో కాస్త ఊరటగా ఉన్న నాన్ బ్యాంకింగ్ రంగం నేడు మాత్రం పెను తాకిడికి గురైంది. ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్, దివాన్ హౌజింగ్, M&M ఫైనాన్షియల్, శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్, బజాజ్ ఫిన్ కంపెనీలు దాదాపు 5 నుండి 9 శాతం నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్ -4.44 శాతం నష్టపోయి రు. 2165.50 వద్ద ట్రేడ్ అయింది. ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్  -7.88 శాతం నష్టపోయి రు. 901.30 వద్ద ట్రేడ్ అయింది. దివాన్ హౌజింగ్ ఫిన్ -4.07 శాతం నష్టపోయి రు. 270.80 కు పడిపోయింది. శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ -5.79 శాతం నష్టపోయి రు.1018.80 వద్ద ట్రేడ్ అవుతోంది.Most Popular