మళ్లీ పడుతున్న ఫైనాన్షియల్‌ స్టాక్స్‌!

మళ్లీ పడుతున్న ఫైనాన్షియల్‌ స్టాక్స్‌!

ఎన్‌బీఎఫ్‌సీల రుణ పోర్ట్‌ఫోలియోలను కొనుగోలు చేసేందుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆసక్తి చూపుతున్నట్లు వెలువడ్డ వార్తలతో బుధవారం జోరందుకున్న ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లు అంతలోనే అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీయంగానూ అమ్మకాలు వెల్తువెత్తాయి. దీంతో పలు కౌంటర్లు భారీ నష్టాలకు లోనవుతున్నాయి. ఎస్‌బీఐ రూ. 45,000 కోట్ల విలువైన రుణ పోర్ట్‌ఫోలియోలను కొనుగోలు చేయనున్నట్లు వెలువడ్డ వార్తలు పలు కౌంటర్లకు ముందురోజు జోష్‌నిచ్చిన సంగతి తెలిసిందే. ఇక గత కొద్ది రోజులుగా డౌన్‌ సర్క్యూట్‌ను తాకుతూ వస్తున్న ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ మరోసారి 5 శాతం పతనంకావడం గమనార్హం! ఈ షేరు రూ. 358 దిగువన ఫ్రీజయ్యింది. 
 
పతన బాటలో
మార్కెట్ల పతనంతో తిరిగి నేలచూపులకు చేరిన కౌంటర్ల జాబితా ఇలా ఉంది.  ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐబీ హౌసింగ్‌ 8 శాతం కుప్పకూలి రూ. 900కు చేరింది. ఇంట్రాడేలో రూ. 860ను తాకింది. ఈ బాటలో బజాజ్‌ ఫైనాన్స్‌ 4 శాతం నష్టంతో రూ. 2178 వద్ద (ఇంట్రాడే కనిష్టం రూ. 2060), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 5 శాతం తిరోగమించి రూ. 5686 వద్ద(రూ. 5565), దివాన్‌ హౌసింగ్‌ 3 శాతం నీరసించి రూ. 276 వద్ద(రూ.242), కేన్‌ఫిన్‌ హోమ్‌ 5 శాతం పతనమై రూ. 239 వద్ద(రూ. 231) ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా రెప్కో హోమ్‌ 3 శాతం క్షీణించి రూ. 375కు(రూ. 362) చేరగా, చోళమండలం 5.4 శాతం తిరోగమించి రూ. 1103ను(రూ. 1057)ను తాకింది. జీఐసీ హౌసింగ్‌ 2.2 శాతం నష్టంతో రూ. 235కు(రూ. 227 ఏడాది కనిష్టం) చేరగా..   ముత్తూట్‌ ఫైనాన్స్‌ 1.5 శాతం క్షీణతతో రూ. 399(రూ. 378) వద్ద కదులుతోంది. 

Image result for sensex tumbles
 
కుదేల్‌
ఫైనాన్షియల్‌ సేవలు అందిస్తున్న ఇతర కౌంటర్లలో ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ 5 శాతం పతనమై రూ. 242ను(రూ.230) తాకాగా. కేపిటల్‌ ఫస్ట్‌ 4 శాతం క్షీణించి రూ. 466(రూ. 455)కు చేరింది. రిలయన్స్‌ కేపిటల్‌ 5 శాతం పడిపోయి రూ. 242(రూ.231) వద్ద ట్రేడవుతోంది. ఎంఅండ్ఎం ఫైనాన్స్‌ దాదాపు 5.2 శాతం వెనకడుగుతో రూ. 385(రూ.374) వద్ద, మ్యాగ్మా ఫిన్‌ కార్ప్‌ 4 శాతం తిరోగమించి రూ. 112(రూ.106) వద్ద, సెంట్రమ్‌ కేపిటల్‌ 6.5 శాతం పతనమై రూ. 36 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా మణప్పురం ఫైనాన్స్‌ 2.4 శాతం నీరసించి రూ. 73వద్ద, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ 5 శాతం పతనమై రూ. 128(రూ. 122)వద్ద, శ్రేఈ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ 6.5 శాతం వెనకడుగుతో రూ. 33 వద్ద కదులుతున్నాయి. ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ దాదాపు 2 శాతం తక్కువగా రూ. 123(రూ.116) వద్ద ట్రేడవుతోంది.  Most Popular