టెక్‌ షాక్‌- అమెరికా మార్కెట్లు బేర్‌!

టెక్‌ షాక్‌- అమెరికా మార్కెట్లు బేర్‌!

ఇటీవల లేనివిధంగా బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లలో భారీ అమ్మకాలకు తెరలేచింది. దీంతో ప్రధాన ఇండెక్సులన్నీ బేర్‌మన్నాయి. డోజోన్స్‌ 832 పాయింట్లు(3.2 శాతం) పడిపోయి 25,599 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 38 పాయింట్లు(3.3 శాతం) పతనమై 2,786 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 316 పాయింట్లు(4.1 శాతం) దిగజారి 7,422 వద్ద స్థిరపడింది. ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు భారీ అమ్మకాలతో కుదేలయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో బుధవారం ఉన్నట్టుండి అమెరికా స్టాక్‌ మార్కెట్లు షాక్‌తిన్నాయి. 

Image result for us stock bear

ఫెడ్‌ ఎఫెక్ట్‌ కూడా
కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ పెంపు అంచనాలతో ఇటీవల జోరందుకున్న ట్రెజరీ ఈల్డ్స్‌ మళ్లీ ఊపందుకున్నాయి. ఏడేళ్ల గరిష్టం 3.35 శాతానికి ఎగశాయి. కాగా.. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ 267 బిలియన్‌ డాలర్ల విలువైన చైనీస్‌ వస్తువులపై అదనంగా సుంకాల విధింపు ఆలోచనలో ఉన్నట్లు వెలువడ్డ వార్తలు సైతం ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో బ్లూచిప్స్‌ బోయింగ్‌ 5 శాతం, కేటర్‌పిల్లర్‌ 4 శాతం చొప్పున పడిపోయాయి. కాగా... రిటైలింగ్‌ సంస్థ సియర్స్‌ దివాళా తీయనున్న వార్తలతో ఈ షేరు 15 శాతం కుప్పకూలింది. దీంతో సెంటిమెంటు దెబ్బతిన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

Image result for faang stocks

ఫ్యాంగ్‌ స్టాక్స్‌ పతనం
టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్‌ రంగాలు 2.3 శాతం చొప్పున క్షీణించాయి. ప్రధానంగా FAANG(ఫ్యాంగ్‌) స్టాక్స్‌ ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, అల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌ 1.5-5.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఎన్‌విడియా 5 శాతం, క్వాల్‌కామ్‌ 4 శాతం చొప్పున దిగజారగా.. ఇంటెల్‌ 3 శాతం నష్టపోయింది. దీంతో ఫిలడెల్ఫియా సెమీకండక్టర్‌ ఇండెక్స్‌ 2.7 శాతం తిరోగమించింది. ఈ బాటలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ రసెల్‌ 2000 సైతం 1.2 శాతం నీరసించింది. చైనాతో వివాదాల కారణంగా లగ్జరీ బ్రాండ్ల సంస్థ జ్యువెవలర్‌ టిఫనీ, హ్యాండ్‌బ్యాగుల సంస్థ మైఖేల్‌ కోర్స్‌, టాపెస్ట్రీ 5-7 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular