నేడు మార్కెట్లలో భారీ పతనం!?

నేడు మార్కెట్లలో భారీ పతనం!?

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ పతనంతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 263 పాయింట్లు పడిపోయి 10,217 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఎట్టకేలకు భారీ నష్టాల నుంచి ఉపశమనాన్ని కల్పిస్తూ బుధవారం మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీ వచ్చింది. రోజు మొత్తం ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు లాభాల హైజంప్‌ చేశాయి. సెన్సెక్స్‌ 461 పాయింట్లు ఎగసి 34,761 వద్ద నిలవగా.. నిఫ్టీ 159 పాయింట్లు జమ చేసుకుని 10,460 వద్ద స్థిరపడింది. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లు దుమ్మురేపాయి. ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 5.5 శాతం, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 3.4 శాతం చొప్పున జంప్‌చేయగా.. రియల్టీ 4.2 శాతం పురోగమించింది. అయితే బుధవారం భారీ అమ్మకాలతో అమెరికా మార్కెట్లు బేర్‌మన్నాయి. ప్రధాన ఇండెక్సులు 3-4 శాతం మధ్య పతనమయ్యాయి. దీంతో నేడు దేశీయంగానూ మార్కెట్లు కుప్పకూలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

Image result for stock brokers in india

నిఫ్టీ కదలికలు ఇలా..! 
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,300 పాయింట్ల వద్ద, తదుపరి 10,200 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,500 పాయింట్ల వద్ద, తదుపరి 10,550 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1096 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1893 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. గత రెండు రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 3047 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 3500 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.Most Popular