బ్యాంకింగ్ హవా- మార్కెట్ల హైజంప్‌

బ్యాంకింగ్ హవా- మార్కెట్ల హైజంప్‌

ఎట్టకేలకు భారీ నష్టాల నుంచి ఉపశమనాన్ని కల్పిస్తూ మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీ వచ్చింది. రోజు మొత్తం ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు లాభాల హైజంప్‌ చేశాయి. సెన్సెక్స్‌ 461 పాయింట్లు ఎగసి 34,761 వద్ద నిలవగా.. నిఫ్టీ 159 పాయింట్లు జమ చేసుకుని 10,460 వద్ద స్థిరపడింది. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లు దుమ్మురేపాయి. ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 5.5 శాతం, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 3.4 శాతం చొప్పున జంప్‌చేయగా.. రియల్టీ 4.2 శాతం పురోగమించింది. ఈ బాటలో ఆటో, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 3-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐటీ 1.5 శాతం క్షీణించింది.

Related image

బ్లూచిప్స్‌ జోరు
నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, జీ, ఐషర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టైటన్‌, హెచ్‌పీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, మారుతీ 10-4.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, సన్‌ ఫార్మా 3-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. 

చిన్న షేర్లూ..
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ భారీ డిమాండ్‌ ఏర్పడింది. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 4 శాతం జంప్‌చేయగా.. స్మాల్‌ క్యాప్‌ 3.5 శాతం ఎగసింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1785 లాభపడగా.. 487 మాత్రమే నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1242 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1526 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1805 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 1974 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.Most Popular