జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బీడీఎల్‌ జోరు 

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బీడీఎల్‌ జోరు 

ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ టెలికం సంస్థ రిలయన్స్‌ జియోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొనడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. మరోపక్క రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) నుంచి ఆర్డర్ దక్కించుకున్నట్లు వెల్లడించడంతో భారత్‌ డైనమిక్స్‌ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. వివరాలు చూద్దాం...

జీ ఎంటర్‌టైన్‌మెంట్
రిలయన్స్‌ ఇన్ఫోకామ్‌(జియో)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 452 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 457 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లకు 41.62 శాతం వాటా ఉంది. ఒప్పందంలో భాగంగా జియో యూజర్లు తమ లైబ్రరీలో ఉన్న మొత్తం కంటెంట్‌ను పొందేందుకు వీలుంటుందని జీ ఎంటర్‌టైన్‌మెంట్ తెలియజేసింది. అంతేకాకుండా కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చని వివరించింది.

Image result for bharat dynamics

భారత్‌ డైనమిక్స్‌
మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌(ఎంఆర్‌ ఎస్‌ఏఎం) రియర్ సెక్షన్‌ సరఫరాల కోసం డీఆర్‌డీవో నుంచి ఆర్డర్ లభించినట్లు భారత్‌ డైనమిక్స్‌ తాజాగా పేర్కొంది. ఆర్డర్‌ విలువ రూ. 200 కోట్లుగా తెలియజేసింది. ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌తో డీఆర్‌డీవో ఏర్పాటు చేసిన భాగస్వామ్య ప్రాజెక్ట్‌ ఎంఆర్‌ ఎస్‌ఏఎంకాగా..  ఆర్డర్ కారణంగా భారత్‌ డైనమిక్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.5 శాతం పెరిగి రూ. 279 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 284 వద్ద గరిష్టాన్నీ, రూ. 270 వద్ద కనిష్టాన్నీ తాకింది.Most Popular