జోష్‌లో బంధన్‌ బ్యాంక్‌, కేఈసీ

జోష్‌లో బంధన్‌ బ్యాంక్‌, కేఈసీ

ఈ ఏడాది క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటుంటే.. తాజాగా బంగ్లాదేశ్‌ నుంచి ఆర్డర్‌ పొందినట్లు వెల్లడించడంతో కేఈసీ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం...

బంధన్‌ బ్యాంక్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్)లో బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం 47 శాతంపైగా ఎగసి రూ. 488 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 56 శాతం పెరిగి రూ. 1078 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.26 శాతం నుంచి 1.3 శాతానికి స్వల్పంగా పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.6 శాతం నుంచి 0.7 శాతానికి చేరాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బంధన్‌ బ్యాంక్‌ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 505 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 521 వద్ద గరిష్టాన్నీ, రూ. 496 వద్ద కనిష్టాన్నీ తాకింది.

Image result for kec international

కేఈసీ ఇంటర్నేషనల్‌
బంగ్లాదేశ్‌ నుంచి విద్యుత్‌ ప్రసారం, పంపిణీ విభాగంలో సరికొత్తగా టర్న్‌కీ ప్రాజెక్టును గెలుచుకున్నట్లు వెల్లడించడంతో కేఈసీ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 263 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 265 వరకూ ఎగసింది. రూ. 1496 కోట్ల విలువైన ఆర్డర్‌లో భాగంగా మేఘనాఘాట్- మదునాఘాట్‌ డబుల్‌ సర్క్యూట్‌ మధ్య 400 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైనును ఏర్పాటు చేయవలసి ఉంటుందని పేర్కొంది. కంపెనీలో ప్రమోటర్లకు 51 శాతం వాటా ఉంది.Most Popular