ఏవియేషన్‌ షేర్లకు లాభాల రెక్కలు!

ఏవియేషన్‌ షేర్లకు లాభాల రెక్కలు!

వైమానిక ఇంధన(ఏటీఎఫ్‌) ధరలపై ఎక్సయిజ్‌ డ్యూటీ తగ్గింపు యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వెలువడటంతో ఏవియేషన్‌ రంగ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మూడు లిస్టెడ్‌ కంపెనీల షేర్లూ లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో స్పైస్‌జెట్‌ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 69 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 70.50 వరకూ ఎగసింది. ఇక ఎన్‌ఎస్ఈలో  జెట్‌ ఎయిర్‌వేస్‌ 8 శాతం దూసుకెళ్లి రూ. 190కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 200 వరకూ జంప్‌చేసింది. ఈ బాటలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ దాదాపు 4 శాతం పెరిగి రూ. 752 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 768 వద్ద గరిష్టాన్ని తాకింది.

Image result for jet indigo spicejet

ఎక్సయిజ్‌ తగ్గింపు?
జెట్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌) ధరలపై ఎక్సయిజ్‌ సుంకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ అనుమతి కోరినట్లు వెలువడ్డ వార్తలు విమానయాన కౌంటర్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటీఎఫ్‌పై ఎక్సయిజ్‌ డ్యూటీ 14 శాతంగా అమలవుతోంది. నిజానికి 2014 వరకూ 8 శాతంగా ఉన్న ఏటీఎఫ్‌పై ఎక్సయిజ్‌ సుంకాన్ని ప్రభుత్వం 14 శాతానికి హెచ్చించింది. వైమానిక సర్వీసుల నిర్వహణలో ఇంధన వ్యయాలదే అధిక వాటా కావడంతో ఎక్సయిజ్‌ సుంకం తగ్గింపు వార్తలు ఈ రంగంలోని షేర్లకు డిమాండ్‌ పెంచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.Most Popular