వహ్వా 'రిలీఫ్‌' ర్యాలీ- బ్యాంక్స్‌ జోరు!

వహ్వా 'రిలీఫ్‌' ర్యాలీ- బ్యాంక్స్‌ జోరు!

ఎట్టకేలకు మార్కెట్లను రిలీఫ్‌ ర్యాలీ ఆవహించింది. గత ఐదు రోజులుగా పతనాలను చవిచూస్తున్న మార్కెట్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి. అటు ఇన్వెస్టర్లు, ఇటు ట్రేడర్లు ఐటీ మినహా దాదాపు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు లాభాల హైజంప్‌ చేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 503 పాయింట్లు దూసుకెళ్లి 34,82కు చేరగా.. నిఫ్టీ 163 పాయింట్లు ఎగసి 10,464ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ మాత్రమే(1.4 శాతం) వెనకడుగు వేయగా.. బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ 3-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. 

బ్లూచిప్స్‌ తీరిదీ
నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐషర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌, మారుతీ, ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌ 10.5-4 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, విప్రో, సన్‌ ఫార్మా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోల్‌ ఇండియా, ఎంఅండ్ఎం 2.4-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. 

Related image

ఫైనాన్షియల్స్‌ దూకుడు
డెరివేటివ్స్‌లో దివాన్‌ హౌసింగ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, చోళమండలం, పిరమల్‌, శ్రేఈ ఇన్‌ఫ్రా, అరవింద్‌, ఎంఅండ్ఎం ఫైనాన్స్‌, నాల్కో, ముత్తూట్‌ ఫైనాన్స్‌ 18-9 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మదర్‌సన్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, మహానగర్‌ గ్యాస్‌, మైండ్‌ట్రీ 4-1.25 శాతం మధ్య తిరోగమించాయి.

చిన్న షేర్లూ..
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 4 శాతం జంప్‌చేయగా.. స్మాల్‌ క్యాప్‌ 3 శాతం ఎగసింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1966 లాభపడగా.. 551 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.Most Popular