మారుతీ స్పీడ్‌, వోల్టాస్‌ కూల్‌!

మారుతీ స్పీడ్‌, వోల్టాస్‌ కూల్‌!

దేశీయంగా కార్ల తయారీ, విక్రయాలలో మార్కెట్‌ లీడర్‌గా పేరున్న మారుతీ సుజుకీ ఇటీవల ప్రవేశపెట్టిన సియాజ్‌ వాహన విక్రయాలు జోరందుకున్నట్లు వెల్లడించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఎయిర్‌ కండిషనింగ్‌, రిఫ్రిజిరేషన్‌ సర్వీసుల టాటా గ్రూప్‌ సంస్థ వోల్టాస్‌ లిమిటెడ్ స్మార్ట్‌ ఏసీలను విడుదల చేయడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం...

Image result for maruti ciaz

మారుతీ సుజుకీ
ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ప్రీమియం సెడాన్‌ విభాగంలోని సియాజ్‌ కార్ల విక్రయాలు 24,000 యూనిట్లను తాకినట్లు మారుతీ సుజుకీ తాజాగా పేర్కొంది. దీంతో ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో సియాజ్‌ మోడల్‌ 28.8 శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. తద్వారా ప్రీమియం సెడాన్‌ విభాగంలో అత్యధిక విక్రయాలు సాధిస్తున్న మోడల్‌గా నిలిచినట్లు వివరించింది. సియాజ్‌ను కంపెనీ ఆగస్ట్‌లో ప్రవేశపెట్టింది. కాగా ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో మారుతీ షేరు 4 శాతం జంప్‌చేసింది. రూ. 6967 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 7025 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లకు 56.21 శాతం వాటా ఉంది. 

Image result for Voltas smart ac

వోల్టాస్‌ లిమిటెడ్‌
పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ ఏసీలను విడుదల చేసినట్లు వెల్లడించడంతో వోల్టాస్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో వోల్టాస్‌ షేరు 5.6 శాతం జంప్‌చేసింది. రూ. 512 వద్ద ట్రేడవుతోంది. అమెజాన్‌ అలెక్సా ద్వారా ప్రవేశపెట్టిన స్మార్ట్‌ ఏసీలు వాయిస్‌ కమాండ్‌ ద్వారా పనిచేయనున్నట్లు వోల్టాస్‌ పేర్కొంది. కంపెనీలో ప్రమోటర్లకు 30.30 శాతం వాటా ఉంది. ఇన్వెర్టర్ స్ప్లిట్‌, స్ప్లిట్‌ ఏసీలను అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయిస్తున్నట్లు తెలియజేసింది. వీటిని అమెజాన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌, తదితర పరికరాల ద్వారా నియంత్రించవచ్చని వివరించింది.Most Popular