ఎస్‌బీఐ దన్ను- ఎన్‌బీఎఫ్‌సీలకు కిక్‌!

ఎస్‌బీఐ దన్ను- ఎన్‌బీఎఫ్‌సీలకు కిక్‌!

ఇటీవల భారీ అమ్మకాలతో పతనబాటలో సాగుతూ వచ్చిన ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుంటంతో పలు హౌసింగ్‌ ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల కౌంటర్లు లాభాలతో దూకుడు చూపుతున్నాయి. జోరందుకున్న జాబితాలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, దివాన్‌ హౌసింగ్‌, కేన్‌ఫిన్‌ హోమ్‌, రెప్కో హోమ్‌, చోళమండలం తదితర కౌంటర్లు నిలుస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా డౌన్‌ సర్క్యూట్‌ను తాకుతూ వస్తున్న ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ మరోసారి 5 శాతం పతనంకావడం గమనార్హం! వివరాలు చూద్దాం..

Image result for state bank of india

లిక్విడిటీ భయాలకు చెక్‌
లిక్విడిటీ భయాలతో ఇటీవల ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లలో అమ్మకాలకు క్యూకట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్‌బీఎఫ్‌సీల రుణ పోర్ట్‌ఫోలియోలను కొనుగోలు చేసేందుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఎస్‌బీఐ రూ. 45,000 కోట్ల విలువైన రుణ పోర్ట్‌ఫోలియోలను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో లిక్విడిటీ మెరుగుపడనున్న అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఎగబడుతున్నట్లు తెలియజేశారు.

జోరుగా హుషారుగా
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు 14 శాతం దూసుకెళ్లి రూ. 279 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో జీఐసీ హౌసింగ్‌ 6.7 శాతం పురోగమించి రూ. 249కు చేరగా..  రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ దాదాపు 8 శాతం ఎగసి రూ. 397ను తాకింది. తొలుత రూ. 400 వరకూ జంప్‌చేసింది. కేన్‌ఫిన్‌ హోమ్‌ 6.3 శాతం పెరిగి రూ. 249 వద్ద,  బజాజ్‌ ఫైనాన్స్‌ 8 శాతం దూసుకెళ్లి రూ. 2230 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా చోళమండలం ఫైనాన్స్‌ 8.3 శాతం జంప్‌చేసి రూ. 1153 వద్ద ట్రేడవుతోంది. ముత్తూట్‌ ఫైనాన్స్‌ సైతం దాదాపు 9 శాతం పుంజుకుని రూ. 405 వద్ద కదులుతోంది. కాగా.. ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ 5 శాతం కోల్పోయి రూ. 376 వద్ద ఫ్రీజయ్యింది. 

Image result for financial
 
దూకుడు...
ఫైనాన్షియల్‌ సేవలు అందిస్తున్న ఇతర కౌంటర్లలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 5794కు చేరగా... ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ 7.5 శాతం ఎగసి రూ. 250ను తాకింది. కేపిటల్‌ ఫస్ట్‌ 6 శాతం దూసుకెళ్లి రూ. 478కు చేరింది. రిలయన్స్‌ కేపిటల్‌ 8 శాతం పెరిగి రూ. 255 వద్ద ట్రేడవుతోంది. మణప్పురం ఫైనాన్స్‌ 8.6 శాతం ఎగసి రూ. 75ను తాకగా.. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ 7 శాతం పురోగమించి రూ. 133కు చేరింది. ఈ బాటలో శ్రేఈ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ సైతం 12 శాతం జంప్‌చేసి రూ. 36 వద్ద కదులుతోంది. ఇతర కౌంటర్లలో ఎంఅండ్ఎం ఫైనాన్స్‌ దాదాపు 9 శాతం జంప్‌చేసి రూ. 403 వద్ద, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ 10 శాతం దూసుకెళ్లి రూ. 164 వద్ద, మ్యాగ్మా ఫిన్‌ కార్ప్‌ 9.4 శాతం ఎగసి రూ. 113 వద్ద, సెంట్రమ్‌ కేపిటల్‌ 15 శాతం పురోగమించి రూ. 38 వద్ద, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ దాదాపు 10 శాతం పెరిగి రూ. 125 వద్ద ట్రేడవుతున్నాయి.Most Popular