మళ్లీ గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ షేర్లకు కిక్‌!

మళ్లీ గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ షేర్లకు కిక్‌!

విదేశీ రీసెర్చ్‌ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌  అమెరికా మెరిల్‌ లించ్‌ గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ ప్రొడక్టుల తయారీ సంస్థలు హెచ్‌ఈజీ లిమిటెడ్‌, గ్రాఫైట్‌ ఇండియా కౌంటర్లకు తాజాగా బయ్‌ రేటింగ్‌ను ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లలో కొనుగోళ్లకు క్యూకట్టారు. ఫలితంగా రెండు షేర్లూ అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. ఈ కౌంటర్లలో కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడం విశేషం! వివరాలు చూద్దాం..

Image result for HEG Ltd

హెగ్‌ హైజంప్‌
రీసెర్చ్‌ సంస్థ బీవోఏఎంఎల్‌ షేరు కొనుగోలుకి సిఫారసు చేయడంతో హెచ్‌ఈజీ లిమిటెడ్‌ కౌంటర్‌ దూకుడు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో  హెచ్‌ఈజీ షేరు 20 శాతం దూసుకెళ్లింది. రూ. 648 పెరిగి రూ. 3889 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది ఇంట్రాడే గరిష్టంకాగా.. తొలుత రూ. 3400 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. రూ. 6700 టార్గెట్‌ ధరను బీవోఏఎంల్‌ ప్రకటించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇది 108 శాతం అధికంకాగా.. క్యాష్‌ ఫ్లో, విస్తరణ నేపథ్యంలో ఇకపై హెగ్‌ భారీ డివిడెండ్లను చెల్లించే వీలున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ అంచనా వేసింది.

Image result for graphite india ltd

గ్రాఫైట్‌ ఇండియా
రీసెర్చ్‌ సంస్థ బీవోఏఎంఎల్‌ షేరు కొనుగోలుకి సిఫారసు చేయడంతో గ్రాఫైట్‌ ఇండియా కౌంటర్‌కు కిక్‌ వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది. రూ. 40 పెరిగి రూ. 830 సమీపంలో ఫ్రీజయ్యింది. రూ. 1550 టార్గెట్‌ ధరను బీవోఏఎంల్‌ ప్రకటించడంతో గ్రాఫైట్‌ ఇండియా కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది దాదాపు 100 శాతం అధికంకాగా.. గ్రాఫైట్‌ రంగంలో ప్రపంచవ్యాప్తంగా చౌకగా లభిస్తున్న కంపెనీ గ్రాఫైట్‌ ఇండియా అంటూ బీవోఏఎంఎల్‌ పేర్కొంది. ఈ ఏడాది సాధించనున్న పటిష్ట ఫలితాలు, క్యాష్‌ ఫ్లో నేపథ్యంలో ఈ షేరుకి బయ్‌ రేటింగ్‌ను ఇచ్చినట్లు తెలియజేసింది. ఇకపై వాటాదారులకు మరింత విలువ చేకూరనున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ అభిప్రాయపడింది. 



Most Popular