లాభాలతో షురూ- ఐటీ వీక్‌!

లాభాలతో షురూ- ఐటీ వీక్‌!

మంగళవారం మరోసారి ఊగిసలాట మధ్య నష్టాలతో నిలిచినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. నిఫ్టీ హాఫ్‌ సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 167 పాయింట్లు ఎగసి 34,467కు చేరింది. నిఫ్టీ సైతం 59 పాయింట్లు పుంజుకుని 10,360 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా వాణిజ్య వివాదాల కారణంగా గ్లోబల్‌ గ్రోత్‌ మందగించవచ్చంటూ ఐఎంఎఫ్‌ తాజాగా అంచనా వేసిన నేపథ్యంలో మంగళవారం అమెరికా మార్కెట్లు డీలాపడగా.. యూరోపియన్‌ మార్కెట్లు లాభపడ్డాయి. కాగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది.  

ఆటో జోరు
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా ఐటీ స్వల్పంగా 0.4 శాతం నీరసించింది.. ఆటో, ఫార్మా, మెటల్‌, రియల్టీ రంగాలు 1 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, జీ, ఇన్‌ఫ్రాటెల్‌, హీరోమోటో, వేదాంతా, హెచ్‌పీసీఎల్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఆటో 4-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, యస్‌ బ్యాంక్‌, విప్రో, అల్ట్రాటెక్‌ 1.5-0.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

Image result for stock investors india

డెరివేటివ్స్‌ తీరు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఎంఆర్‌పీఎల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, పిరమల్‌, దివాన్‌ హౌసింగ్‌, నాల్కో, ఈక్విటాస్‌, ముత్తూట్‌, ఇండిగో 7.6-4.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క కావేరీ సీడ్‌, ఐడియా, బలరామ్‌పూర్‌, బెర్జర్‌ పెయింట్స్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, రామ్‌కో సిమెంట్‌ 2-1 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్ల బాటలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం బలపడ్డాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో 1.75, 1.25 శాతం చొప్పు పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1112 లాభపడగా.. 411 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి.Most Popular