H1-B వీసా దారులకు ఇక మరిన్ని కష్టాలే...

H1-B వీసా దారులకు ఇక మరిన్ని కష్టాలే...

ఇప్పటికే అమెరికా వీసా నిబంధనలను మరింత కఠిన తరం చేసిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరో నిబంధనను జత చేసింది. అమెరికా రావాలనుకునే వారు భవిష్యత్తులో ఎలాంటి అమెరికన్ గవర్నమెంట్ నుండి ప్రతిఫలాలు గానీ లాభాలు గాని పొందరాదని , పబ్లిక్ బెనిఫిట్స్ పొందడానికి వారు అర్హులు కారని ప్రకటించింది. US డిపార్ట్‌మెంట్ ఫర్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో వీసా దారులు ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలో వివరించారు. ప్రభుత్వ ఫలాలను అందుకునే వారు వీసా  పొందడానికి అర్హులు కారని పబ్లిక్ ఛార్జ్ ముసాయిదాలో పేర్కొన్నారు. అయితే దీర్ఘకాలంగా అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు ఇది వర్తించదని అంటున్నారు. కానీ కొత్తగా వీసా దరఖాస్తు చేసుకున్న వారందరూ భవిష్యత్తులో అమెరికన్ పబ్లిక్ అలవెన్స్‌లు కానీ, ప్రభుత్వ రాయితీలు కానీ పొందబోమని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 447 పేజీల సుదీర్ఘ డాక్యుమెంట్‌ను గత సెప్టెంబర్ 22న ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసింది. కొత్తగా H-1 B వీసాను పొందుగోరు వారు తాము స్వయం సమృద్ధి తో ఉన్నామని , ఎటువంటి ప్రభుత్వ, పబ్లిక్ ప్రతిఫలాలను ఆశించమని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఎయిడ్స్ పొందేవారు  అమెరికా నుండి తిరిగి పంపించి వేయబడతారని ట్రంప్ వర్గాలు తెలిపాయి. పబ్లిక్ ఛార్జ్ కింద వీసా అప్లికేషన్స్ తిరస్కరించబడతాయని, వీసా కొనసాగింపు అప్లికేషన్స్‌కి కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పబ్లిక్ ఛార్జ్ ముసాయిదాలోని ముఖ్యాంశాలు:
* భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు కోరరాదు.
* 61 సంవత్సరాలకు పైబడినవారు, 18 లోపు ఉన్నవారు ఇక వీసా పొందడం మరింత కష్టతరమే.
* ఆరోగ్య కారణల వల్ల కూడా వీసా తిరస్కరించవచ్చు
* ఆర్ధిక పరిస్థితులు, పూర్ క్రెడిట్ స్కోర్ కూడా వీసా తిరస్కరణకు కారణంగా చూపించవచ్చు
* ఉన్నత విద్య లేకపోవడం, ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేక పోవడం .
* ఉద్యోగ నైపుణ్యాలు లేక పోవడం .
* వీసా కోరుకున్న వ్యక్తిపై  ఎక్కువమంది ఆధారపడి ఉండటం (డిపెండెంట్స్ )
ఇక ఈ పబ్లిక్ ఛార్జ్ నిబంధనలతో వీసా వ్యయం, జారీలో జాప్యం మరింత పెరగొచ్చని ఇమ్మిగ్రేషన్ విశ్లేషకులు భావిస్తున్నారు. పబ్లిక్ ఛార్జ్ నిబంధనల పేరిట వీసా దరఖాస్తు దారుడి నుండి మరిన్ని వివరాలను అమెరికన్ అధికారులు అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక రకంగా వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అని మానవ హక్కుల సంఘాలు అంటున్నాయి. ఇమ్మిగ్రేషన్ అటార్నీలు మాత్రం దీనిని చట్టపరమైన వలసలను అరికట్టడానికి ఇదో అడ్డుకట్టగా భావిస్తున్నారు.

ప్రభుత్వ బెనిఫిట్స్ కట్...
ఈ పబ్లిక్ ఛార్జ్ ముసాయిదా ప్రకారం ఇప్పటికే అమెరికాలో అధిక సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులకు అక్కడ ఎలాంటి గవర్నమెంట్ సబ్సిడీలు, పబ్లిక్ సర్వీస్‌లు పొందడాలు ఉండబోవు. ఉదాహరణకు అక్కడి ఫుడ్ స్టాంప్స్, ఫెడరల్ హౌసింగ్, అద్దె రాయితీలు, ఆరోగ్య బీమా, అత్యవసర వైద్య చికిత్సలు, లాంటి వాటిలో ప్రవాస భారతీయులకు ఎలాంటి ప్రయోజనాలు దక్కబోవు. ఒక వేళ వారు ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలనైనా  పొందినట్టు తెలిస్తే...  వారి వీసాను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది.   
న్యూయార్క్ కు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ మరియు, లా ఫర్మ్ ఫౌండింగ్ పార్టనర్  సైరస్ మెహతా ఈ పబ్లిక్ ఛార్జ్ ముసాయిదా మీద స్పందిస్తూ... ' ఇది వందేళ్ళపాటు కొనసాగే చట్టమని, మనం ఎంత అర్ధం చేసుకున్నా ఇది మరో కోణంలో ప్రతిస్పందిస్తుందని' అంటున్నారు.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న H1-B వీసా హోల్డర్ , మిగతా ఉద్యోగుల కంటే తక్కువ బెనిఫిట్స్ పొందుతారు. పబ్లిక్ బెనిఫిట్స్ ఏవీ వారికి ఇక ముందు దక్కబోవు ఈ చట్టం ప్రకారం. అంతే కాకుండా వీసా కొనసాగింపుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు గతంలో పబ్లిక్ బెనిఫిట్స్ ఏవీ పొందలేదని అఫడవిట్ ను కూడా జత చేయాల్సి ఉంటుంది.Most Popular