ఫైనాన్షియల్‌ స్టాక్స్‌పై అమ్మకాల పిడుగు!

ఫైనాన్షియల్‌ స్టాక్స్‌పై అమ్మకాల పిడుగు!

గత వారం ఉన్నట్టుండి పతనబాట పట్టిన ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకు క్యూ కడుతున్నారు. దీంతో పలు హౌసింగ్‌ ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల కౌంటర్లు ఏడాది కనిష్టాలను తాకుతున్నాయి. మరికొన్ని కౌంటర్లు భారీ నష్టాలవైపు ప్రయాణిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా డౌన్‌ సర్క్యూట్‌ను తాకుతూ వస్తున్న ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ మరోసారి 5 శాతం పతనంకాగా.. దివాన్‌ హౌసింగ్‌, కేన్‌ఫిన్‌ హోమ్‌, రెప్కో హోమ్‌ తదితర కౌంటర్లోనూ తాజాగా అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం..

పతన బాటలో
లిక్విడిటీ భయాలతో ఇటీవల ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లలో అమ్మకాలకు క్యూకడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు 19 శాతం కుప్పకూలి రూ. 222 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 206ను తాకింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ 5 శాతం కోల్పోయి రూ. 415 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో జీఐసీ హౌసింగ్‌ 6.5 శాతం తిరోగమించి రూ. 232 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 227 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ ప్రస్తుతం 5 శాతం నష్టంతో రూ. 381 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 361 వరకూ జారింది. ఇది 52 వారాల కనిష్టంకాగా..  కేన్‌ఫిన్‌ హోమ్‌ 5 శాతం పతనమై రూ. 225 వద్ద ట్రేడవుతోంది. రూ. 218 వద్ద 52 వారాల కనిష్టం. ఇదే విధంగా బజాజ్‌ ఫైనాన్స్‌ 3 శాతం నష్టపోయి రూ. 1974 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1912 వరకూ వెనకడుగు వేసింది. 

Image result for investors in shock
 
ఏడాది కనిష్టాలు..
ఫైనాన్షియల్‌ సేవలు అందిస్తున్న ఇతర కౌంటర్లలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ తొలుత రూ. 5230 వరకూ జారింది. ప్రస్తుతం స్వల్ప నష్టంతో రూ. 5370 వద్ద ట్రేడవుతోంది. ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ 3.3 శాతం నష్టంతో రూ. 232 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 224 వరకూ నీరసించింది. ఇది ఏడాది కనిష్టంకాగా.. కేపిటల్‌ ఫస్ట్‌ 5 శాతం నష్టంతో రూ. 454కు చేరింది. తొలుత రూ. 434 వద్ద 52 వారాల కనిష్టాన్ని చేరింది. ఇక రిలయన్స్‌ కేపిటల్‌ 9 శాతం వెనకడుగుతో రూ. 236 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 222 వరకూ క్షీణించింది. ఇది ఏడాది కనిష్టంకాగా.. మణప్పురం ఫైనాన్స్‌ 6 శాతం క్షీణించి రూ. 68ను తాకగా.. తొలుత రూ. 66 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ 1 శాతం తిరోగమించి రూ. 126కు చేరింది. ఇంట్రాడేలో రూ. 115 దిగువన 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో శ్రేఈ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ సైతం 2 శాతం బలహీనపడి రూ. 32 వద్ద కదులుతోంది. Most Popular