ద్రవ్య పరపతి పెరిగేదెలా?

ద్రవ్య పరపతి పెరిగేదెలా?

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు... దేశ ఆర్ధిక వ్యవస్థ ఘనంగా ఉన్నా.. అంతర్జాతీయ ముడి చమురు,   డాలర్‌తో రూపీ మారకపు విలువ పడిపోవడం వంటి కారణాలతో ద్రవ్య లభ్యత నానాటికీ క్షీణిస్తూ ఉంది. మార్కెట్లు నేల చూపులు చూస్తుండటం, మదుపర్ల సంపద ఆవిరైపోతూ ఉండటం పట్ల ఆందోళనలు రేకెత్తుతున్నాయి. పెట్రో రేట్లపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ సబ్సీడీలు నెలకు రు. 105కోట్లకు చేరాయి. ఇందులో కేంద్రం 42 శాతం రు. 61కోట్లు భరిస్తుండగా మిగతావి రాష్ట్రాలు భరిస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్య లోటుతో సతమతమౌతున్న ప్రభుత్వానికి ఇది మరో పెను భారంగా మిగలనుంది. ప్రత్యక్ష పన్నులు ఇప్పటి వరకూ ప్రోత్సాహకరంగానే ఉన్నప్పటికీ..మిగతా అంశాలు మాత్రం దారుణంగానే ఉన్నాయి. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం జీఎస్టీ ట్యాక్స్ రాబడిలో  దాదాపు రు. 1 ట్రిలియన్ నగదు కొరత ఉంది. డైరెక్ట్ ట్యాక్స్ విధానంలో అదనపు వ్యయాల ఖర్చును రు. 380 బిలయన్లకు పెంచడంతో ప్రభుత్వం రు. 1.5 లక్షల కోట్ల ద్రవ్య లోటును ఎదుర్కొంటుంది.   ఇప్పటికే ఈ ఆర్ధిక సంవత్సరం తొలి 5 మాసాల్లోనే ద్రవ్యలోటు పరిమితిలో 94.7శాతానికి టచ్ చేసింది. దీనివల్ల దాదాపు రు. 5.91 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఏర్పడింది.


వచ్చే ఆర్ధిక సంవత్సరం ఆశాజనకమేనా?
దీంతో రాబోయే ఏడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోడం ద్వారా రానున్న ప్రమాదాన్ని నివారించవచ్చు. రు. 330 బిలియన్లను సమకూర్చుకోడం ద్వారా సంక్షోభ నివారణకు యత్నించవచ్చు. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి ద్రవ్య లోటు రు.5లక్షల 25వేల కోట్లు ఉండగా, 2018-19 కిగాను అది రు.5లక్షల 91 వేల కోట్లుగా ఉండొచ్చని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా ఈ ఆర్ధిక సంవత్సరం నుండి రానున్న ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రభుత్వం రు.125 బిలియన్ల పెట్రో సబ్సీడీలను భరించనుంది. అలాగే.. హెల్త్ కవర్ రంగంలో రు.35 బిలియన్లను, వ్యవసాయ రంగానికి రు. 80 బిలియన్స్ సబ్సీడీని అదనంగా భరిస్తుంది. దీంతో ద్రవ్యలోటు నానాటికీ పెరిగిపోతుంది. వ్యయ రాబడిల మధ్య అంతరం పెరుగుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూపీ బలోపేతానికి చర్యలు తీసుకోడం, అంతర్జాతీయ ముడి చమురు ధరలు అదుపులోకి వస్తే...రానున్న ఆర్ధిక సంవత్సరంలో కొంత మెరుగైన ఫలితాలు కనబడొచ్చన్నది ఆర్ధిక శాఖ అంచనా.Most Popular