కోలుకోడానికి BNP పారిబాస్ చిట్కాలు ...

కోలుకోడానికి BNP పారిబాస్ చిట్కాలు ...

గత నాలుగు మార్కెట్ పనిదినాల్లో సెన్సెక్స్ దాదాపు 2000 పాయింట్లను కోల్పోడంతో మదుపర్లు షాక్‌కు గురయ్యారు. స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ షేర్లు 75 శాతానికి పైనే నష్టపోడంతో ఇన్వెస్టర్లు కోలుకోలేని నష్టాన్ని ఎదుర్కొన్నారు. మార్కెట్ సంక్షోభం నుండి బయట పడేదెలా? దీర్ఘ కాలికంగా స్టాక్స్‌ను హోల్డింగ్ చేస్తే లాభాలుంటాయా?  ముందు ముందు మదుపర్లకు అనుకూలంగా RBI నిర్ణయాలుంటాయా? వీటన్నింటికీ సానుకూల విశ్లేషణను ప్రముఖ షేర్ బ్రోకరేజ్ సంస్థ BNP పారిభాస్ అందిస్తుంది. 


* ట్రేడ్ సంక్షోభాన్ని దిద్దుబాటు చేయలేక పోయిన RBI పరపతి విధానం
* ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా చైనా వాణిజ్య పోరు మదుపర్లను అస్థిర పరుస్తున్నాయి.
* ఈ సంక్షోభ సమయంలో IT, ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులే సరైన నిర్ణయం
* HCL, సన్ ఫార్మా, పురోగతి సాధించే కంపెనీలుగా కనబడుతున్నాయి. ఈ కంపెనీల్లో పెట్టుబడులు మల్టీ బ్యాగర్లు కావొచ్చు
* రానున్న రోజుల్లో ఆరోగ్యకరమైన Q2 ఫలితాలను మనం చూడొచ్చు.
* మనీ మార్కెట్లలోని అస్థిరత తగ్గుముఖం పడుతుంది.
* మార్కెట్ దిద్దుబాటు చర్యలతో అక్టోబర్‌లో సూచీలు ఏకీకరణ జోన్‌లోకి జారిపోవచ్చు
* అస్థిరత ఎప్పుడు ఇన్వెస్టర్‌కు మంచి స్నేహితుడిలా ఉపయోగ పడుతుంది. 
* వృద్ధి కలిగిన కంపెనీలను ఎంచుకోడానికి ఈ అస్థిరత, మార్కెట్ భయాలు ఉపయోగపడతాయి
* ICICI బ్యాంక్, ITC , ఆర్తీ ఇండస్ట్రీస్ , జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, బజాజ్ ఫిన్ సర్వ్ లలో పెట్టుబడులు రానున్న 20-   24 నెలల్లో అధిక లాభాలు నమోదు చేయవచ్చు.
* IL&FS సంస్థ క్రెడిట్ రేటింగ్స్ 'AAA' నుండి  D" (డీఫాల్ట్ ) కు పడిపోవడంతో NBFC కంపెనీలపై మదుపర్లలో    ఆందోళన మొదలైంది. ఈ భయాలే ఆ కంపెనీల షేర్ల నేలమట్టానికి కారణమయ్యాయి. 
* RBI  ద్రవ్య లిక్విడిటీని సర్దుబాటు చేయడంలో సఫలమైతేనే మార్కెట్లు కోలుకోవచ్చు.
* రు. 36,000 కోట్ల నగదును OMO రూపంలో విడుదల చేస్తేనే నగదు లభ్యత జరగుతుంది.
* ఇప్పుడున్న మార్కెట్ ముఖచిత్రాన్ని బట్టి NBFC ల్లో పెట్టుబడులు నిరాశజనకమే.
* నాలుగు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరగబోయే జనరల్ ఎలక్షన్ల తరువాతే.. స్థిర మార్కెట్ సూచీలు    కనబడొచ్చు.
క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల పాశ్చాత్య ఆయిల్ ఉత్పత్తి కంపెనీల షేర్లు, షేల్ గ్యాస్ ధరలు పెరగొచ్చు.
ఎస్ బ్యాంక్ విషయంలో తటస్థంగా కానీ, మధ్యస్థంగా కానీ ఉండటం మేలు. ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్ ఓ మంచి స్టాక్ ఎంపిక మాత్రం కాదని BNP పారిభాస్ తన విశ్లేషణలో పేర్కొంది. Most Popular